ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్ మీ తన కొత్త ఫ్లాగ్ షిప్ ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. అదే రియల్ మీ జీటీ 5జీ. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీంతోపాటు 120 హెర్ట్జ్ అమోఎల్ఈడీ డిస్ ప్లే, వెనకవైపు మూడు కెమెరాలు వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. దీని టచ్ శాంప్లింగ్ రేట్ ఏకంగా 360 హెర్ట్జ్‌గా ఉండటం విశేషం. ఇందులో ఉన్న జీటీ మోడ్ గేమర్లకు ఉపయోగపడనుంది. రియల్ మీ జీటీ 5జీ ధర
ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధరను 2,799 యువాన్లుగా(సుమారు రూ.31,400) నిర్ణయించారు. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,299 యువాన్లుగా(సుమారు రూ.37,000) ఉంది. బ్లూ, సిల్వర్, రేసింగ్ ఎల్లో కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ప్రస్తుతానికి చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన సేల్ చైనాలో మార్చి 10వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ ఫోన్ త్వరలో మనదేశంలో కూడా లాంచ్ కానుంది.
రియల్ మీ జీటీ 5జీ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.43 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. దీని రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 360 హెర్ట్జ్‌గానూ ఉంది. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 91.7 శాతంగా ఉంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో అందించారు.
ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా ఉన్నాయి. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ సెల్పీ కెమెరాను అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 125W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ వోల్టే, వైఫై 6, యూఎస్బీ టైప్-సీ పోర్టు వంటి ఫీచర్లను ఇందులో అందించారు. దీని మందం 0.84 సెంటీమీటర్లు కాగా, బరువు 186 గ్రాములుగా ఉంది.