రియల్ మీ ఇటీవలే తన నార్జో 20 సిరీస్‌లో మూడు ఫోన్లను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. వీటిలో రియల్ మీ నార్జో 20ఏ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో మొదటిసారి ఈరోజు(సెప్టెంబర్ 30వ తేదీ) జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్ కార్ట్, రియల్ మీ వెబ్ సైట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది.
Also Read: వామ్మో.. టాయిలెట్‌కు రూ.170 కోట్లా? ఇంతకీ ఇందులో ఏముందంటే!
రియల్ మీ నార్జో 20ఏ ధర
ఇందులో రెండు వేరియంట్లను రియల్ మీ లాంచ్ చేసింది. వీటిలో 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,499గా ఉంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.9,499గా నిర్ణయించారు. గ్లోరీ సిల్వర్, విక్టరీ బ్లూ రంగుల్లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. దీని సేల్ ఫ్లిప్ కార్ట్, రియల్ మీ వెబ్ సైట్లలో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది.
రియల్ మీ నార్జో 20ఏ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.5 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. 4 జీబీ వరకు ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్ ను ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇందులో కూడా వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో 12 మెగా పిక్సెల్ సెన్సార్ ను ప్రధాన కెమెరాగా అందించారు. దీంతోపాటు 2 మెగా పిక్సెల్ మోనోక్రోమ్ లెన్స్, 2 మెగా పిక్సెల్ రెట్రో సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందువైపు 8 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు.
Also Read: అత్యంత చవకైన 6 జీబీ ర్యామ్ ఫోన్ ఇదే.. లాంచ్ చేసిన షియోమీ!
ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్ మీ యూఐ ఆపరేటింగ్ సిస్టంపై రియల్ మీ నార్జో 20ఏ పనిచేయనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఫోన్ వెనకభాగంలో అందించారు. 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, మైక్రో యూఎస్ బీ పోర్టు వంటి ఫీచర్లను ఇందులో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ గా ఉంది. రివర్స్ చార్జింగ్ ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.89 సెంటీమీటర్లుగానూ, బరువు 195 గ్రాములుగానూ ఉంది.