రియల్మీ నార్జో 30 4జీ, నార్జో 30 5జీ, 32 అంగుళాల ఫుల్ హెచ్డీ టీవీలు జూన్ 24వ తేదీన లాంచ్ కానున్నాయి. ఈ లాంచ్ ఈవెంట్‌ను ట్వీటర్, ఫేస్బుక్, యూట్యూబ్‌ల్లో ఈ ఈవెంట్ లైవ్ చూడవచ్చు. రియల్ మీ నార్జో 30 4జీ గత నెలలో మలేషియాలో లాంచ్ కాగా, నార్జో 30 5జీ తర్వాత యూరోప్‌లో లాంచ్ అయింది. దీంతోపాటు రియల్ మీ 32 అంగుళాల ఫుల్ హెచ్డీ స్మార్ట్ టీవీ లాంచ్ చేయనుంది. దీని లుక్స్, పిక్చర్ క్వాలిటీ ఎక్కువగా ఉండనుంది. అల్ట్రా బ్రైట్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఫీచర్ ఇందులో అందించనున్నారు. దీంతోపాటు ఇందులో క్వాడ్ స్టీరియో స్పీకర్లు ఉండనున్నాయి. దీని ద్వారా స్టీరియోస్కోపిక్ సౌండ్ అవుట్ పుట్ అందించనున్నారు. ఈ మూడు ఉత్పత్తులూ రూ.15 వేలలోపే మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
రియల్ మీ నార్జో 30 స్పెసిఫికేషన్లు
ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1080 x 2400 పిక్సెల్స్‌గా ఉంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్‌గా ఉండనుంది. దీంతోపాటు 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 30W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 25 నిమిషాల్లో 50 శాతం చార్జింగ్, 65 నిమిషాల్లో 100 శాతం చార్జింగ్ ఈ ఫోన్ ఎక్కుతుందని కంపెనీ తెలిపింది.
ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్మీ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. డ్యూయల్ 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ 5, జీపీఎస్/గ్లోనాస్, యూఎస్బీ టైప్-సీ పోర్టు, ఎన్ఎఫ్సీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. దీని మందం 0.94 సెంటీమీటర్లు కాగా, బరువు 192 గ్రాములుగా ఉంది.
రియల్మీ నార్జో 30 5జీ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.5 అంగుళాల ఫుల్హెచ్డీ+ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 90.5 శాతంగా ఉంది. 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఇందులో అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్‌గా ఉండగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ లెన్స్, 2 మెగాపిక్సెల్ టెర్టియరీ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్మీ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. దీని మందం 0.85 సెంటీమీటర్లుగానూ, బరువు 185 గ్రాములుగానూ ఉంది.