రియల్ మీ నార్జో 30 ప్రో 5జీ ఫోన్ ధరను ఫ్లిప్ కార్ట్ కార్నివాల్ సేల్‌లో తగ్గించారు. మనదేశంలో అత్యంత చవకైన 5జీ ఫోన్ ఇదే. దీనిపై ఇప్పుడు మరింత తగ్గింపు లభించింది. మరింత తగ్గింపుతో కేవలం రూ.15,999కే అందుబాటులో ఉండనుంది. ఇందులో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్‌ను అందించారు. రియల్ మీ నార్జో 30 ప్రో 5జీ ధర
ఇందులో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గా ఉండేది. ఇప్పుడు ఈ సేల్‌లో దీన్ని రూ.15,999కు తగ్గించారు. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా ఉండేది. దాన్ని రూ.18,999కు తగ్గించారు. స్వార్డ్ బ్లాక్, బ్లేడ్ సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
రియల్ మీ నార్జో 30 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్మీ యూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లేను అందించనున్నారు. దీని రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, యాస్పెక్ట్ రేషియో 20:9గానూ ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్‌పై రియల్ మీ నార్జో 30 ప్రో పనిచేయనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్లు కూడా ఇందులో ఉన్నాయి. ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.
8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్డీ కార్డు ద్వారా మరింత పెంచుకోవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 30W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్టులను ఇందులో అందించారు. దీని మందం 0.91 సెంటీమీటర్లుగానూ, బరువు 194 గ్రాములుగానూ ఉంది.