యాప్నగరం

Xiaomi ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్! ఈ ఫోన్ కొనాలనుకునేవారు కొన్నాళ్లు ఆగితే మంచిది!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్! షియోమీ గత సంవత్సరం లాంచ్ చేసిన సక్సెస్ ఫుల్ స్మార్ట్ ఫోన్ ధర కరోనా వైరస్ కారణంగా పెరిగింది. అదే ఫోన్? ధర ఎంత పెరిగింది?

Samayam Telugu 13 Feb 2020, 7:47 am
చైనాపై తీవ్రప్రభావం చూపిస్తున్న కరోనావైరస్ ప్రభావం షియోమీపై కూడా పడింది. ఈ సంస్థ తమ స్మార్ట్ ఫోన్ రెడ్ మీ నోట్ 8 ధరను మనదేశంలో రూ.500 పెంచింది. కరోనా వైరస్ ప్రభావంతో సప్లై చైన్ దెబ్బతినడమే దీనికి కారణం. అయితే ఈ పెంపు తాత్కాలికమేనని షియోమీ తెలిపింది. అన్నీ సర్దుకున్నాక షియోమీ దాని ధరను మళ్లీ తగ్గించే అవకాశం ఉంది.
Samayam Telugu Redmi Note 8 Price Hike


Also Read: Vivo స్మార్ట్ ఫోన్లపై Amazonలో భారీ ఆఫర్లు.. రూ.13,800 వరకు తగ్గింపు.. నేడే లాస్ట్!

ఈ ధర పెంపు కూడా రెడ్‌మీ నోట్ 8 4 జీబీ + 64 జీబీ మోడల్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఇంతకు ముందు ఈ ఫోన్‌ ధర రూ. 9,999గా ఉంది. ఇప్పుడు ధర పెరుగుదల అనంతరం దీని ధర రూ.10.499గా ఉంది.

Also Read: Samsung Galaxy S20 Ultra: S20, S20+ లను మించే ఫోన్ ఇదే! Appleకు గట్టిపోటీ!

చైనాలో నెలకొన్న పరిస్థితి మా సప్లై చైన్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని షియోమీ తెలిపింది. అంతేకాకుండా పూర్తి సరఫరాపై కూడా ఇది ప్రభావం చూపే ప్రమాదం ఉందని పేర్కొంది. కొన్ని భాగాలు, ముడి పదార్థాల కోసం ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను అన్వేషించడానికి మేము పనిచేస్తున్నామని తెలిపింది. అయితే దీని తక్షణ ప్రభావం కారణంగా సరఫరా తగ్గిపోవడం ముడి భాగాల ధరలు పెరిగేలా చేసిందని వివరించింది. ఇదే కొంత ప్రతికూల ఒత్తిడిని కలిగించి, రెడ్ మీ నోట్ 8 ధరను తాత్కాలికంగా పెంచడానికి దారితీసిందని పేర్కొంది.

Also Read: Samsung Galaxy Z Flip: ధర, ఫీచర్లు తర్వాత సంగతి? దీని డిజైనే సూపర్!

ఎంఐ.కామ్, అమెజాన్ ల్లో ధరల పెరుగుదల ఇప్పుడే కనిపిస్తుంది. ఇక ఈ ఫోన్ విషయానికి వస్తే... ఇందులో 6.3 అంగుళాల స్క్రీన్ ను అందించారు. వెనకవైపు 48 మెగా పిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్ గా ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.