యాప్నగరం

Samsung A01 Core: ధర రూ.10 వేలలోపే? స్పెసిఫికేషన్లు కూడా లీక్!

శాంసంగ్ త్వరలో కొత్త బడ్జెట్ ఫోన్ గెలాక్సీ ఏ01 కోర్ ను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన లీకులు ఈ మధ్య బాగా వచ్చాయి.

Samayam Telugu 27 Jun 2020, 1:49 pm
శాంసంగ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఏ01 కోర్ ను రూపొందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ లో కనిపించింది. అయితే ప్రస్తుతం ఈ ఫోన్ లీక్డ్ ఫొటోలు ఆన్ లైన్ లో ప్రత్యక్షమయ్యాయి. ఈ ఫోన్ ముందూ, వెనకా ఏ విధంగా ఉంటుందో ఈ ఫొటోను చూస్తే అర్థం చేసుకోవచ్చు. రెడ్, బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కనిపించింది. అలాగే వెనకవైపు సింగిల్ కెమెరా, దాని కిందనే ఫ్లాష్ కూడా ఉంది. ఈ ఫోన్ రూ.10 వేల లోపు ధరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
Samayam Telugu Samsung Galaxy A01 Core Renders Leaked


Also Read: బడ్జెట్ ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. త్వరలో రెడ్ మీ 9ఏ లాంచ్!

ఈ రెండర్ ను మొదట ప్రముఖ టిప్ ప్టర్ ఇవాన్ బ్లిస్ షేర్ చేశారు. ఈ ఫొటో ద్వారా ఆ ఫోన్ డిజైన్ గురించి పూర్తిగా తెలిసిపోయింది. ముందువైపు పాత ఫోన్ల తరహాలో బెజెల్స్ ను అందించారు. సెల్ఫీ కెమెరా ఫోన్ పైభాగంలో ఉంది. సెల్ఫీ కెమెరా పక్కనే ఇయర్ పీస్ కూడా ఉంది. వెనకవైపు పట్టు బాగుండటం కోసం గరుకుగా ఉండే విధంగా ప్యానెల్ ను అందించారు. ఈ ఫోన్ రెడ్, బ్లూ రంగుల్లో అందుబాటులో ఉండనుంది. వాల్యూమ్, పవర్ బటన్లు ఫోన్ కుడివైపు ఉన్నాయి.

ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు కూడా చాలా వరకు లీకయ్యాయి. ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై(గో ఎడిషన్) ఈ ఫోన్ పనిచేయనుంది. హెచ్ డీ+ డిస్ ప్లేను ఇందులో అందించారు. మీడియాటెక్ HT6739WW ప్రాసెసర్ ను ఇందులో అందించే అవకాశం ఉంది. 1 జీబీ ర్యామ్ ఇందులో ఉండనుంది.

Also Read: ఫోన్ కంటే సన్నని టీవీలు... ధర మాత్రం రూ.20 వేల లోపే!

ఈ ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్ సైట్ లో SM-A013F/DS మోడల్ నంబర్ తో కనిపించింది. శాంసంగ్ గెలాక్సీ ఏ01 కోర్ లో బ్లూటూత్ వీ5 ఫీచర్ ఉండనున్నట్లు ఈ లిస్టింగ్ ద్వారా తెలిసింది. వైఫై అలయన్స్, డ్యూయల్ బ్యాండ్ వైఫై ఫీచర్లు కూడా ఇందులో ఉండనున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.