యాప్నగరం

గుడ్ న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్‌ ధర తగ్గింది.. రూ.20 వేలలో మంచి ఫోన్!

శాంసంగ్ గెలాక్సీ ఏ31 స్మార్ట్ ఫోన్ ధరను మనదేశంలో రూ.1,000 తగ్గించారు. దీంతో పాటు బ్యాంక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.

Samayam Telugu 2 Jul 2020, 1:09 pm
శాంసంగ్ గెలాక్సీ ఏ31 స్మార్ట్ ఫోన్ ధరను మనదేశంలో తగ్గించారు. శాంసంగ్ దీని ధరను రూ.1,000 తగ్గించింది. దీంతోపాటు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ.1,000 క్యాష్ బ్యాక్ లభించనుంది. అంటే మొత్తంగా రూ.2,000 తక్కువకే ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చన్న మాట. ఈ ఫోన్ మనదేశంలో జూన్ లో లాంచ్ అయింది. శాంసంగ్ ఈమధ్యే గెలాక్సీ ఏ51 స్మార్ట్ ఫోన్ పై కూడా ఆఫర్లను ప్రకటించింది.
Samayam Telugu Samsung Galaxy A31 Price Drop


Also Read: బడ్జెట్ వన్ ప్లస్ ఫోన్ పేరు ఫిక్స్ అయ్యింది.. కెమెరా అద్భుతం!

శాంసంగ్ గెలాక్సీ ఏ31 ధర మనదేశంలో లాంచ్ అయినప్పుడు రూ.21,999గా ఉంది. ఇప్పుడు ధర తగ్గింపుతో రూ.20,999కు వచ్చింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్ తో కొనుగోలు చేస్తే రూ.19,999కే కొనవచ్చు. ప్రిజం క్రష్ బ్లాక్, ప్రిజం క్రష్ బ్లూ, ప్రిజం క్రష్ వైట్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్, అమెజాన్, శాంసంగ్ ఇండియా వెబ్ సైట్లలో అందుబాటులో ఉంది.

ఈ స్మార్ట్ ఫోన్ లో 6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ సూపర్ అమోఎల్ఈడీ ఇన్ ఫినిటీ-యూ డిస్ ప్లేను అందించారు. దీని పిక్సెల్ రిజల్యూషన్ 1080x2400 పిక్సెల్స్ గా ఉంది. డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పీ65 ప్రాసెసర్ పై శాంసంగ్ గెలాక్సీ ఏ31 పనిచేయనుంది. ఆండ్రాయిడ్ 10 ఆధారిత వన్ యూఐ 2.1 ఆపరేటింగ్ సిస్టంను ఇందులో అందించారు.

ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగా పిక్సెల్ డెప్త్ కెమెరా, 5 మెగా పిక్సెల్ మాక్రో కెమెరాలు కూడా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందువైపు 20 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు.

Also Read: ఈ ఐఫోన్‌పై ఏకంగా రూ.40 వేలు తగ్గింపు.. ఎక్కడ అందుబాటులో ఉందంటే?

ఇందులో 128 జీబీ స్టోరేజ్ అందించారు. దీన్ని మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్ బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 15W ఫాస్ట్ చార్జింగ్ ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. దీని బరువు 185 గ్రాములు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.