యాప్నగరం

గెలాక్సీ ఏ42 5జీ వచ్చేసింది... అత్యంత చవకైన శాంసంగ్ 5జీ ఫోన్ ఇదే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ శాంసంగ్ తన కొత్త ఫోన్ గెలాక్సీ ఏ42 5జీని లాంచ్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇవే.

Samayam Telugu 2 Sep 2020, 7:40 pm
శాంసంగ్ గెలాక్సీ ఏ42 5జీని కంపెనీ లాంచ్ చేసింది. అయితే దీని గురించిన కొన్ని వివరాలను మాత్రమే శాంసంగ్ తెలిపింది. శాంసంగ్ అందించే చవకైన 5జీ ఫోన్ ఇదే కానుందని సమాచారం. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరా సెటప్ ఉండనుందని సమాచారం. ముందువైపు సింగిల్ సెల్ఫీ కెమెరా ఉండనుంది. ఈ ఫోన్ అంచులు కూడా చాలా సన్నగా ఉండనున్నాయి. ఈ ఫోన్ వెనకభాగంలో బ్లూ, గ్రే ప్యాటర్న్ ను అందించారు.
Samayam Telugu New Project


Also Read: రూ.10 వేలలోనే 5జీ ఫోన్.. రియల్ మీ వీ3 వచ్చేసింది... ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

శాంసంగ్ దీని గురించిన వివరాలను పూర్తిగా వెల్లడించలేదు. దీనికి సంబంధించిన ధర కూడా తెలియరాలేదు. ఈ ఫోన్ ధర శాంసంగ్ గెలాక్సీ ఏ51 5జీ కంటే తక్కువగా ఉండే అవకాశముంది. గెలాక్సీ ఏ51 5జీ ధర 499.99 డాలర్లుగా(సుమారు రూ.36,600) ఉంది. అయితే గెలాక్సీ ఏ42 5జీకు సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సిన అవసరం ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఏ42 5జీ స్పెసిఫికేషన్లు
ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల గురించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఇందులో 6.6 అంగుళాల సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించనున్నారు. ఇందులో 5జీ సపోర్ట్ కూడా ఉండనుంది. ఇమేజ్ ని బట్టి ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్ ను అందించనున్నారు. దాని కిందనే ఫ్లాష్ కూడా ఉంది. పవర్, వాల్యూమ్ బటన్లు ఫోన్ కు కుడివైపున ఉన్నాయి.

Also Read: రియల్ మీ ఎక్స్7, ఎక్స్7 ప్రో వచ్చేశాయ్.. రూ.19 వేలలోనే 5జీ ఫోన్లు.. ధర, ఫీచర్లు ఇవే!

ఈ సంవత్సరం మార్చిలో లాంచ్ అయిన గెలాక్సీ ఏ41కు తర్వాతి వెర్షన్ గా ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఈ రెండు ఫోన్ల డిజైన్ దాదాపు ఒకేలా ఉంది. ఇందులో ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లేను అందించే అవకాశం ఉంది. ఇందులో 5000 ఎంఏహెచ్ లేదా అంతకంటే ఎక్కువ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.