యాప్నగరం

Samsung Galaxy A71 5G వచ్చేస్తుంది.. ఫీచర్లు, ధర లీక్!

దక్షిణకొరియాకు చెందిన దిగ్గజ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ మరో 5జీ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయనుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ71 5జీ వేరియంట్ త్వరలో లాంచ్ కానుంది? దాని ధర ఎంత? ఫీచర్లేంటి?

Samayam Telugu 9 Apr 2020, 9:40 am
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఏ71కు 5జీ వేరియంట్ ను లాంచ్ చేయడానికి సిద్ధం అవుతుంది. మొదట దీన్ని చైనాలో లాంచ్ చేయనున్నారు. తర్వాత మిగతా దేశాల్లో కూడా అందుబాటులోకి తేనున్నారు.
Samayam Telugu New Project


ఇప్పటివరకు లీకైన స్పెసిఫికేషన్లను చూసుకుంటే ఇంతకుముందున్న గెలాక్సీ ఏ71 ఇంతకుముందు వెర్షన్లో అందించిన ఫీచర్లనే ఇందులోనూ అందించున్నారు. ప్రముఖ టిప్ స్టర్ ఎవాన్ బ్లాస్ లీక్ చేసిన అధికారిక రెండర్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ రెండు ఫోన్లూ చూడటానికి కూడా దాదాపు ఒకేలా ఉన్నాయి. స్పెసిఫికేషన్లు కూడా అంతే. కేవలం ప్రాసెసర్, బ్యాటరీలు మాత్రమే మారే అవకాశం ఉంది.

Also Read: మొబైల్ డేటా ఎక్కువగా వాడతారా? నెలకు 84 జీబీ డేటా అందించే ప్లాన్లు ఇవే!

5జీ ఫీచర్ ఉన్న గెలాక్సీ ఏ71 స్మార్ట్ ఫోన్ లో శాంసంగ్ ఎక్సినోస్ 980 ప్రాసెసర్ ను అందించే అవకాశం ఉంది. ఇందులో 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందించనున్నారు. చైనా సర్టిఫికేషన్ సైట్ టెనా తెలిపిన వివరాల ప్రకారం ఇందులో 4370 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. అయితే ఇది కాస్త ఆశ్చర్యపరిచే విషయమే. ఎందుకంటే ఒరిజినల్ వెర్షన్ అయిన గెలాక్సీ ఏ71 బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ కంటే ఎక్కువే.

Also Read: మీరు ఎయిర్ టెల్ యూజర్లా? అయితే ఈ టాప్-10 బెస్ట్ ప్లాన్లపై ఓ లుక్కేయండి!

ఇక ధర విషయానికి వస్తే.. అధికారిక సమాచారం ఏదీ ఇంతవరకు తెలియలేదు. అయితే చైనాలో దీని ధర 3500 యువాన్లుగా(సుమారు.37,800) ఉండే అవకాశం ఉంది. దీని ధర ఒక్కో దేశంలో ఒక్కోలా ఉండే అవకాశం ఉంది. అయితే ధరలో మార్పు మాత్రం ఎక్కువగా ఉండబోదు. ఇది 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. సాధారణ మోడల్ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ తో రానుంది.

ఈ స్మార్ట్ ఫోన్ బ్లూ, బ్లాక్, వైట్ రంగుల్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అయితే ఈ ఫోన్ సరిగ్గా ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయం ఇంకా తెలియరాలేదు. అయితే ఈ లీకులను బట్టి చూస్తే త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Also Read: Best Budget Smartphones: రూ.15 వేలలోపు బెస్ట్ ఫోన్లు ఇవే!(ఏప్రిల్ 2020)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.