యాప్నగరం

వెనకవైపు ఐదు కెమెరాలతో వచ్చే మొదటి శాంసంగ్ ఫోన్ ఇదే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్.. తన గెలాక్సీ ఏ72 స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు ఐదు కెమెరాలు అందించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇవే.

Samayam Telugu 26 Sep 2020, 11:19 am

ప్రధానాంశాలు:

  • శాంసంగ్ గెలాక్సీ ఏ72లో మొదటిసారి ఈ ఫీచర్!
  • వచ్చే ఏడాది ప్రథమార్థంలో లాంచ్
  • గెలాక్సీ ఏ52 కూాడా అప్పుడే
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Samsung Galaxy A72
శాంసంగ్ గెలాక్సీ ఏ72 స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు ఐదు కెమెరాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ 2021 ప్రధమార్థంలో వచ్చే అవకాశం ఉంది. మొదటగా ఈ ఫీచర్‌ను ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్‌లో అందిస్తారని వార్తలు వచ్చాయి. కానీ మిడ్ రేంజ్ విభాగంలో ఉన్న గెలాక్సీ ఏ72లో దీన్ని మొదటిసారి అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో లాంచ్ అయిన గెలాక్సీ ఏ71కు తర్వాతి వెర్షన్ గా ఈ ఫోన్ లాంచ్ కానుంది.
Also Read: జియోతో చేతులు కలపనున్న పబ్జీ? త్వరలో తిరిగి వస్తుందా!

దక్షిణకొరియాకు చెందిన ది ఎలెక్ రిపోర్ట్స్ కంపెనీ ఈ వివరాలను వెల్లడించింది. ఇందులో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్‌గా ఉండనుండగా, 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 8 మెగా పిక్సెల్ టెలిఫొటో కెమెరా, 5 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా, 5 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్‌లను కూడా అందించనున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఈ ఫోన్ ముందువైపు 32 మెగా పిక్సెల్ కెమెరాను అందించనున్నట్లు కూడా ఈ కంపెనీ తన కథనంలో పేర్కొంది. శాంసంగ్ గెలాక్సీ ఏ52 కూడా గెలాక్సీ ఏ72తో పాటు లాంచ్ అవుతుందని ఈ కథనంలో పేర్కొన్నారు. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలను అందించనున్నారు. గెలాక్సీ ఏ51కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది.

అయితే శాంసంగ్ లాంచ్ చేయబోయే ఈ గెలాక్సీ ఏ72 ఐదు కెమెరాలతో వచ్చే మొదటి ఫోన్ కాదు. నోకియా 9 ప్యూర్‌వ్యూలో ఇప్పటికే వెనకవైపు ఐదు కెమెరాలు ఉన్నాయి. శాంసంగ్ వచ్చే ఏటి నుంచి ఇటువంటి స్మార్ట్ ఫోన్లు మరిన్ని లాంచ్ చేయనుందని కూడా సమాచారం.

Also Read: స్మార్ట్‌ఫోన్ క్లోనింగ్.. సుశాంత్ కేసులో కీలకం ఇదే? ఎలా చేస్తారంటే?

ఇంతకుముందు వచ్చిన కథనాల ప్రకారం గెలాక్సీ ఏ-సిరీస్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో వచ్చే కొద్ది ఫోన్లలో గెలాక్సీ ఏ72 కూడా ఒకటని తెలుస్తోంది. శాంసంగ్ ఈ ఫీచర్‌ను వచ్చే సంవత్సరం మరిన్ని హైఎండ్ ఏ-సిరీస్ ఫోన్లకు తేనున్నట్లు సమాచారం. ఈ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సిస్టంలో ప్రత్యేకమైన హార్డ్‌వేర్, సాఫ్ట్ వేర్ ఫీచర్లను అందిస్తారు. దీని ద్వారా బ్లర్ అవ్వకుండా ఫొటోలు తీయవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.