శాంసంగ్ గెలాక్సీ ఎం62 స్మార్ట్ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) సర్టిఫికేషన్ వెబ్ సైట్లో కనిపించింది. ఈ లిస్టింగ్‌ను మైస్మార్ట్‌ప్రైస్ మొదట గుర్తించింది. శాంసంగ్ గెలాక్సీ ఎం62 5జీ స్మార్ట్ ఫోన్ SM-M626B/DS మోడల్ నంబర్‌తో కనిపించింది. ఈ లిస్టింగ్‌లో కనిపించిందంటే.. త్వరలో ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ అవుతుందని అనుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎం62 ఇటీవలే థాయ్‌ల్యాండ్‌లో లాంచ్ అయింది. అందులో ఎక్సినోస్ 9825 4జీ ప్రాసెసర్‌ను అందించారు. గెలాక్సీ ఎం62 5జీ స్మార్ట్ ఫోన్లో వేరే ప్రాసెసర్‌ను అందించనున్నారని తెలుస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్62కి రీబ్రాండెడ్ వెర్షన్‌గా గెలాక్సీ ఎం62 మనదేశంలో లాంచ్ కానుందని సమాచారం. ఈ ఫోన్లో కూడా 7000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.
శాంసంగ్ గెలాక్సీ ఎం62 స్పెసిఫికేషన్లు(థాయ్‌ల్యాండ్ వెర్షన్)
ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోఎల్ఈడీ ఇన్ఫినిటీ-ఓ డిస్ ప్లేను అందించారు. ఎక్సినోస్ 9825 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 7000 ఎంఏహెచ్ కాగా, 25W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. ఇది రివర్స్ చార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఇందులో అందించారు. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్ల ఇందులో ఉన్నాయి. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇందులో అందించారు. దీని మందం 0.95 సెంటీమీటర్లు కాగా, బరువు 218 గ్రాములుగా ఉంది.