యాప్నగరం

మనదేశంలో S20 ఫోన్ల ధరను వెల్లడించిన Samsung.. Jio యూజర్లకు రూ.14,997 విలువైన లాభాలు!

దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ శాంసంగ్ తన తాజా S20 సిరీస్ స్మార్ట్ ఫోన్ల భారతదేశ ధరను ప్రకటించింది. మరి వాటి ధర ఎంత? లాంచ్ ఆఫర్లేంటి?

Samayam Telugu 15 Feb 2020, 4:34 pm
Samayam Telugu samsung galaxy s20 series smartphones india price launch offers sale date revealed
మనదేశంలో S20 ఫోన్ల ధరను వెల్లడించిన Samsung.. Jio యూజర్లకు రూ.14,997 విలువైన లాభాలు!
శాంసంగ్ తాజా ఫ్లాగ్ షిప్ మొబైల్స్ ఎస్20 సిరీస్ స్మార్ట్ ఫోన్ల భారతదేశ ధరలను వెల్లడించింది. శాంసంగ్ అందించనున్న ఈ స్మార్ట్ ఫోన్లన్నిటిలో శాంసంగ్ గెలాక్సీ ఎస్20 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ఎక్కువగా ఉంది. ఆ తర్వాత ఎస్20+ ధర ఎక్కువగా ఉండగా, ఎస్20 ఆ తర్వాత స్థానంలో నిలిచింది. గతేడాది విడుదల శాంసంగ్ గెలాక్సీ ఎస్10 సిరీస్ స్మార్ట్ ఫోన్లకు శాంసంగ్ ఈ మధ్యే లాంచ్ చేసింది. మరి ఆ తరహాలోనే వీటికి కూడా లైట్ వెర్షన్లు వచ్చే అవకాశం ఉంది. అయితే దానికి ఇంకా చాలా సమయమే పడుతుంది. మరి ఈ ఫోన్ల ధరలు మనదేశంలో ఎంత? ఎప్పట్నుంచి అందుబాటులోకి వస్తాయి? లాంచ్ ఆఫర్లేంటి? అనే విషయాలు తెలుసుకోవడానికి కథనాన్ని పూర్తిగా చదవండి!

​​​ఆర్డర్ ఎప్పుడు చేయాలి? ఫోన్ ఎప్పుడు చేతికి వస్తుంది?

శాంసంగ్ ఇండియా వెబ్ సైట్ లో తెలిపిన దాని ప్రకారం దీనికి సంబంధించిన ప్రీఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ ఫోన్లు మార్చి 6వ తేదీ నుంచి అందుబాటులో ఉండనున్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్20, గెలాక్సీ ఎస్20 ప్లస్, గెలాక్సీ ఎస్20 అల్ట్రా.. మూడు ఫోన్లూ అప్పటినుంచే అందుబాటులో ఉండనుంది.

​బుకింగ్ మాత్రమే కాదు.. ఆఫర్లు కూడా!

ఈ గెలాక్సీ ఎస్20, గెలాక్సీ ఎస్20+, ఎస్20 అల్ట్రా స్మార్ట్ ఫోన్ల బుకింగ్ కు సంబంధించిన వివరాలతో పాటు.. వీటిపై అందుబాటులో ఉన్న లాంచ్ ఆఫర్లు, టెలికాం రంగ సంబంధిత ఆఫర్లను కూడా శాంసంగ్ తెలిపింది.


Also Read: Samsung Galaxy S20: సూపర్ హిట్ ఫోన్ కు సీక్వెల్ కూడా వచ్చేసింది.. ఇంతకీ ధర ఎంతంటే?

​ధరలు ఇవే!

శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ధర రూ.66,999గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్20+ స్మార్ట్ ఫోన్ ధర రూ.73,999గా ఉండగా, గెలాక్సీ ఎస్20 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ధర రూ.92,999గా ఉంది. ఇవి ఈ గెలాక్సీ ఎస్20 సిరీస్ స్మార్ట్ ఫోన్ల ప్రారంభ ధరలు కావచ్చు. అయితే కంపెనీ ఈ విషయమై ఎటువంటి స్పష్టతనూ అందించలేదు.

​బడ్స్ కూడా తక్కువ ధరకే!

శాంసంగ్ గెలాక్సీ ఎస్20 స్మార్ట్ ఫోన్ కొన్నవారికి శాంసంగ్ గెలాక్సీ బడ్స్ ప్లస్ ను కేవలం రూ.2,999కే అందించనున్నారు. అమెరికాలో వీటి ధర 149 డాలర్లు(సుమారు రూ.10,700)గా ఉంది. అలాగే గెలాక్సీ ఎస్20+, గెలాక్సీ ఎస్20 అల్ట్రా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసిన వారికి వీటిని రూ.1,999కే అందించనున్నారు.


Also Read: Samsung Galaxy S20 Ultra: S20, S20+ లను మించే ఫోన్ ఇదే! Appleకు గట్టిపోటీ!

​శాంసంగ్ కేర్+ సర్వీస్ కూడా!

గెలాక్సీ ఎస్20 సిరీస్ స్మార్ట్ ఫోన్లు కొనేవారికి శాంసంగ్ గెలాక్సీ కేర్+ సర్వీస్ ను కూడా అందించనున్నారు. మీ ఫోన్ కు భౌతికంగా కానీ, నీటి ద్వారా కానీ ఏదైనా డ్యామేజ్ అయితే ఈ సర్వీస్ ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు. మీరు స్క్రీన్ డ్యామేజ్ కూడా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. అయితే కేర్+ సర్వీస్ ధర రూ.1,999గా ఉంది. దీని వ్యాలిడిటీ ఒక సంవత్సరం వరకు ఉంటుంది.

​​జియో డబుల్ డేటా ఆఫర్!

ఇక టెలికాం ఆపరేటర్లు అందించే ఆఫర్ల విషయానికి వస్తే.. ఈ గెలాక్సీ ఎస్20 సిరీస్ స్మార్ట్ ఫోన్లకు జియో డబుల్ డేటాను అందించనుంది. మీరు రూ.4,999 వార్షిక ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే సంవత్సరం కాలం పాటు 350 జీబీ + 350 జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తంగా 700 జీబీ అన్నమాట. దీంతో పాటు మరో సంవత్సరం పాటు జియో నుంచి జియోకు అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. మరో 700 జీబీ హై స్పీడ్ డేటా లభిస్తుంది. ఈ మొత్తం లాభాల విలువ మామూలుగా అయితే రూ.14,997 కాగా, ఆఫర్ కింద కేవలం రూ.4,999కే లభిస్తుందన్న మాట.


Also Read: Samsung Galaxy Z Flip: ధర, ఫీచర్లు తర్వాత సంగతి? దీని డిజైనే సూపర్!

​ఎయిర్ టెల్, వొడాఫోన్ ల్లో ఈ ఆఫర్లు!

మరో వైపు ఎయిర్ టెల్, వొడాఫోన్ కూడా డబుల్ డేటా ఆఫర్లను అందించనున్నాయి. రూ.298, రూ.398 ప్లాన్ తో రీచార్జ్ చేసుకునే ఎయిర్ టెల్ వినియోగదారులకు మొదటి 10 రీచార్జ్ ల పాటు డబుల్ డేటాను అందించనున్నారు. వొడాఫోన్ విషయానికి వస్తే.. 56 రోజుల వ్యాలిడిటీ ఉన్న రూ.399 ప్లాన్ తో రీచార్జ్ చేసుకునే వారికి మొదటి ఆరు రీచార్జ్ ల పాటు డబుల్ డేటా లభించనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.