యాప్నగరం

ఎలక్ట్రిక్ వాహనాల టెక్నాలజీని Mobile బ్యాటరీలకు తీసుకొస్తున్న సామ్‌సంగ్‌ - లాభమేంటంటే ?

Samsung Stacked battery Technology : మొబైల్‌ బ్యాటరీల తయారీలో సామ్‌సంగ్‌ కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు సిద్దమైందని సమాచారం. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలను తయారు చేసే టెక్నాలజీతో మొబైల్‌ బ్యాటరీలను రూపొందించేందుకు ప్లాన్‌ చేస్తోందని ఓ నివేదిక వెల్లడించింది. ఈ కొత్త ప్రక్రియ ఏంటి.. ఎలాంటి ప్రయోజనాలు ఉండనున్నాయో చూడండి.

Authored byKrishna Prakash | Samayam Telugu 21 Apr 2022, 1:51 pm
సాధారణంగా చాలా కంపెనీలు కెమెరాలను హైలైట్ చేస్తూ కొత్త స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొస్తుంటాయి. ఇటీవల బ్యాటరీ పర్ఫార్మెన్స్‌పై కూడా ఎక్కువ దృష్టిసారిస్తున్నాయి. అయితే, సాధారణంగా ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ సామ్‌సంగ్‌ (Samsung) ఎక్కువ సామర్థ్యమున్న బ్యాటరీలను ఇస్తున్నాా.. ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ విషయంలో మాత్రం అంత ముందు ఉండడం లేదు. మిగిలిన అన్ని విషయాల్లో దూకుడుగా ఉండే Samsung.. బ్యాటరీ ఆవిష్కరణల విషయంలో కాస్త నెమ్మదిగా ఉంటుందని వాదన. ఉదాహరణకు ఇప్పటికే షియోమీ, ఒప్పో, రియల్‌మీ నుంచి 120వాట్లు, 150వాట్లు, 200వాట్ల ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీలు విడుదల కాగా.. సామ్‌సంగ్‌ తన ఫ్లాగ్‌షిప్‌ మొబైల్‌ గెలాక్సీ ఎస్ 22 అల్ట్రాలోనూ 45వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ మాత్రమే ఇచ్చింది. గెలాక్సీ ఫోన్‌లలో ఎక్కువగా 25వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. దీన్ని బట్టి ఫాస్ట్ చార్జింగ్‌ టెక్నాలజీలపై సామ్‌సంగ్‌ ఎంతగా ఆసక్తి చూపడం లేదనిపిస్తోంది. అయితే ఇప్పుడు బ్యాటరీ తయారీలో Samsung కొత్త విప్లవాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోందట. ఎలక్ట్రిక్ వాహనాల్లో (Electric Vehicles) ఉండే బ్యాటరీల టెక్నాలజీతో స్మార్ట్‌ఫోన్‌ల బ్యాటరీలను రూపొందించేందుకు సిద్ధమవుతోందని సమాచారం. అసలు ఏంటీ టెక్నాలజీ.. ఎందుకు ఉపయోగపడుతుందంటే..?
Samayam Telugu Samsung
Samsung New Battery Tech


ఎలక్ట్రిక్ వాహనాల్లో (EVs) ఉపయోగించే స్టాకింగ్ టెక్నాలజీని స్మార్ట్‌ఫోన్‌ల బ్యాటరీ తయారీలో వినియోగించాలని సామ్‌సంగ్‌ ప్లాన్‌ చేస్తోందని కొరియన్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ మీడియా సంస్థ The Elec వెల్లడించింది. ప్రస్తుతం స్టాక్డ్ సెల్ (Stacked cell) బ్యాటరీలను ఎక్కువగా ఎలక్ట్రిక్ కార్లలో వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఈవీ కంపెనీల భాగస్వామ్యంతో ఈ బ్యాటరీలను సామ్‌సంగ్‌ ఉత్పిత్తి చేస్తోంది. అయితే ఇదే టెక్నాలజీతో స్మార్ట్‌ఫోన్‌లకు కూడా చిన్నపాటి స్టాక్డ్ సెల్ లిథియమ్ ఇయాన్ బ్యాటరీలను (Stocked cell lithium-ion batteries) రూపొందించే ప్రణాళిక రచించింది.

ప్రస్తుతం మొబైళ్ల బ్యాటరీల తయారీ.. ఎక్కువగా వైండింగ్ ప్రక్రియ ద్వారా జరుగుతోంది. దీనితో పోలిస్తే ఈ స్టాకింగ్ ప్రాసెసస్ ద్వారా మరిన్ని లాభాలు ఉంటాయి. ఈ ప్రక్రియ వల్ల బ్యాటరీల శక్తి ఉద్పాదక సాంద్రత (Energy density) 10 శాతం వరకు అధికమవుతుంది. దీనిద్వారా బ్యాటరీ సైజ్ పెంచకుండానే 10శాతం వరకు ఎక్కువ సామర్థ్యాన్ని పొందుపరచవచ్చు. అంటే వైండింగ్ ప్రక్రియతో 5000mAh బ్యాటరీని ఉత్పత్తి చేసే సైజ్‌లోనే.. స్టాకింగ్ ప్రక్రియతో 5,500mAh సామర్థ్యాన్ని పొందుపరచవచ్చు. అంటే బ్యాటరీ సైజ్ తగ్గినా.. సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. అలాగే బ్యాటరీ ఉత్పత్తి ఖర్చు కూడా 10శాతం తగ్గుతుంది. స్టాక్డ్ టెక్నాలజీతో తయారు చేసిన బ్యాటరీలో విభిన్నమైన సెల్స్ ఒకదానిపై ఒకటి అతుక్కొని ఉంటాయి. దీని ద్వారా బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా సుదీర్ఘంగా ఉంటుంది.

చైనాలోని టియాన్‌జిన్ ప్లాంట్‌లో ఈ స్టాక్డ్ బ్యాటరీల ఉత్పత్తిని ప్రయోగాత్మకంగా చేపట్టేందుకు సామ్‌సంగ్‌ సిద్ధమైందని సమాచారం. పూర్తిస్థాయిలో దక్షిణ కొరియాలోని ప్లాంట్‌లోనే ఈ కొత్త టెక్నాలజీ మొబైల్‌ బ్యాటరీలను తయారు చేసేందుకు Samsung సిద్ధమైందని The Elec నివేదిక పేర్కొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.