యాప్నగరం

స్ల్పిట్ AC, విండో AC మధ్య తేడాలు ఇవే.. ఏసీ కొనాలనుకుంటే తప్పక తెలుసుకోండి

Split AC vs Window AC : మీరు ఏసీ కొనాలనుకుంటున్నారా.. అయితే విండో ఏసీ, స్ల్పిట్ ఏసీ మధ్య తేడాలను తప్పక తెలుసుకోవాల్సిందే. ఏదీ ఎలా ఉంటుంది.. మీ అవసరాలకు, మీ గదికి ఎలాంటి ఏసీ సూటవుతుందో చూడండి.

Samayam Telugu 8 Apr 2022, 6:58 pm
ఎండాకాలం క్రమంగా తీవ్రమవుతోంది. వేసవితాపం పెరిగిపోతోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ అధికమవుతున్నాయి. ఈ తరుణంలో అందరూ చల్లదనాన్ని కోరుకుంటారు. ఈ వేసవి తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది ఎయిర్ కండీషనర్స్ ( Air Conditioners ) వైపు మొగ్గుచూపుతున్నారు. గదులను ఏసీలు వేగంగా కూల్ చేస్తాయి. అందుకే ఏసీలు (ACs) కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఏసీల్లో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. అవి స్ల్పిట్ ఏసీలు, విండో ఏసీలు. AC కొనాలనుకుంటే తప్పకుండా వీటి మధ్య తేడాలు ఏంటో తెలుసుకోవాలి.. అలాగే మీ అవసరాలకు ఏది సూటవుతుందో ఎంపిక చేసుకోవాలి. Window AC, Split AC మధ్య తేడాలు ఇవే.
Samayam Telugu Split AC vs Window AC
Split AC vs Window AC


స్ల్పిట్ ఏసీ (Split AC)
స్ల్పిట్ ఏసీ.. రెండు యూనిట్లుగా ఉంటుంది. చల్లబరిచే ప్రధానమైన ఏసీ యూనిట్ గది లోపల ఉంటుంది. ఇది ఇండోర్ యూనిట్. దీంట్లో ఎవాపరేటర్, బ్లోయర్, క్యాపిలరీ ట్యూబ్, ఎయిర్‌ఫిల్టర్, కూలింగ్ కాయిల్స్ ఉంటాయి. ఈ యూనిట్‌ను మొత్తంగా ఎవాపరేటర్ అంటారు. ఈ యూనిట్ గదిలో ఉంటుంది.
ఇక స్ల్పిట్ ఏసీలో రెండో యూనిట్ గది బయట ఉంటుంది. దీంట్లో కంప్రెజర్, మోటార్, ఫ్యాన్, డిస్జార్జ్, కండెన్సర్ ఉంటాయి. దీంట్లో కండెన్సర్ ప్రధాన భాగం కావడంతో దీన్ని కండెన్సర్ యూనిట్ అని కూడా అంటారు. గదిలో ఉన్న ఎవాపరేటర్‌కు తాజా గాలిని పంపి.. వేడి గాలిని గది నుంచి ఈ యూనిట్ బయటికి పంపేస్తుంది. ఈ రెండు యూనిట్లకు కనెక్షన్‌గా సక్షన్ లైన్, లిక్విడ్ లైన్ ఉంటాయి. ప్రస్తుతం అధికంగా స్ల్పిట్ ఏసీలనే చూస్తుంటాం.

ఈ స్ల్పిట్ ఏసీలో ఓ యూనిట్ బయట ఉండడం వల్ల గదిలో స్పేస్ తక్కువగా ఉన్నా సరిపోతుంది. గోడకు ఇష్టమైన చోట అటాచ్ చేయవచ్చు. ఒకచోటి నుంచి మరో చోటికి సులువుగా మార్చవచ్చు. అయితే స్ల్పిట్ ఏసీని అమర్చాలంటే టెక్నిషియన్ ఉండాల్సిందే.

విండో ఏసీ (Window AC)
విండో ఏసీ మొత్తం ఒకే యూనిట్‌గా ఉంటుంది. దీన్ని కిటికీకి లేదా ఏసీకి అవసరమైన సైజ్‌లో గోడను తొలగించి బిగించాల్సి ఉంటుంది. ఈ ఏసీ ముందరి సగ భాగం గది లోపల ఉంటుంది. మిగిలిన సగ భాగం బయటికి ఉండేలా అమర్చాలి. ఈ ఏసీకి ఎక్కువ స్థలం కావాలి. ఒకచోటి నుంచి మరో చోటికి మార్చడం కష్టం. ఎందుకంటే కచ్చితంగా కిటికీ అంత స్పేస్ ఉంటేనే దీన్ని అమర్చే అవకాశం ఉంటుంది.

ధరలు ఎలా ఉంటాయంటే..
స్ల్పిట్ ఏసీలతో పోలిస్తే విండో ఏసీల ధర తక్కువగా ఉంటుంది. ఒకే టోనేజ్ సామర్థ్యమున్నా విండో ఏసీల ధర కాస్త తక్కువగా ఉంటుంది.

శబ్దం
విండో ఏసీల నుంచి శబ్దం ఎక్కువగా వస్తుంది. దీనితో పోలిస్తే స్ల్పిట్ ఏసీలు చాలా నిశ్శబ్దంగా పని చేస్తాయి.

మెయింటెనెన్స్, సర్వీస్
విండో ఏసీకి ఒకే యూనిట్ ఉంటుంది కాబట్టి మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుంది. స్ల్పిట్ ఏసీ రెండు యూనిట్లు ఉండడంతో మెయింటెనెన్స్, సర్వీస్ కొంత ఎక్కువే.

కూలింగ్ఏసీ టోనేజ్‌ను బట్టి కూలింగ్ సామర్థ్యం ఉంటుంది. అలాగే స్టార్ రేటింగ్‌ను బట్టి విద్యుత్‌ను వినియోగించుకుంటాయి. అయితే విండో ఏసీలతో పోలిస్తే స్ల్పిట్ ఏసీలు కాస్త ఎక్కువ పవర్‌ను వాడుకుంటాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.