టీసీఎల్ 20 5జీ, టీసీఎల్ 20 ఎస్ఈ స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. వీటిలో టీసీఎల్ 20 5జీ కాస్త ప్రీమియం మోడల్. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 690 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఇక టీసీఎల్ 20 ఎస్ఈ విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 460 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది.
టీసీఎల్ 20 5జీ ధర
దీని ధరను 299 యూరోలుగా(సుమారు రూ.26,600) నిర్ణయించారు. మిస్ట్ గ్రే, ప్లాసిడ్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. వచ్చే నెలలో ఈ ఫోన్ సేల్ ఎన్నో దేశాల్లో ప్రారంభం కానుంది.
టీసీఎల్ 20 ఎస్ఈ ధర
ఇక టీసీఎల్ 20 ఎస్ఈ ధరను 149 యూరోలుగా(సుమారు రూ.13,200) నిర్ణయించారు. ఈ ఫోన్ నుయిట్ బ్లాక్, అరోరా గ్రీన్ రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ కూడా వచ్చే నెల నుంచి అందుబాటులో ఉండనుంది. అయితే మనదేశంలో ఇవి లాంచ్ అవుతాయో లేదో కంపెనీ తెలపలేదు.
టీసీఎల్ 20 5జీ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ ప్లేను అందించారు. హోల్ పంచ్ తరహా డిజైన్ ఇందులో ఉంది. డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉండగా, స్క్రీన్ టు బాడీ రేషియో 91 శాతంగా ఉంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 690 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించనున్నారు. దీన్ని మైక్రోఎస్డీ కార్డు ద్వారా మరో 256 జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించనున్నారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్‌గా ఉండనుంది. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉండనున్నాయి. ఇక సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
ఆండ్రాయిడ్ 11 ఆధారిత టీసీఎల్ యూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్టు, 4జీ, 5జీ, వైఫై, బ్లూటూత్ వీ5.1 వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందుబాటులో ఉంది.
టీసీఎల్ 20 ఎస్ఈ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.82 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ ప్లేను అందించారు. వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిజైన్ ఇందులో ఉంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 460 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించనున్నారు. దీన్ని మైక్రోఎస్డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 16 మెగాపిక్సెల్‌గా ఉండనుంది. దీంతోపాటు 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉండనున్నాయి. ఇక సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
ఆండ్రాయిడ్ 11 ఆధారిత టీసీఎల్ యూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్టు, 4జీ, వైఫై, బ్లూటూత్ వీ5.1 వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఫోన్ వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందుబాటులో ఉంది.