యాప్నగరం

Vivo T1 5G: రూ.20వేలలోపు స్లిమ్మెస్ట్ ఫోన్ తీసుకొస్తున్న వివో.. అదిరే ఫీచర్లతో, లాంచ్ ఎప్పుడంటే?

భారత్‌లో టీ సిరీస్ మొబైళ్లను ఫిబ్రవరిలో భారత్‌కు తీసుకొచ్చేందుకు వివో సిద్ధమైంది. రూ.20వేలలోపు ధరతో స్లిమ్మెస్ట్, ఫాస్టెస్ట్ 5జీ ఫోన్‌గా Vivo T1 5Gను ఫిబ్రవరి 9న విడుదల చేయనున్నట్టు ప్రకటించింది.

Samayam Telugu 31 Jan 2022, 5:13 pm
Vivo T1 5G India launch Date: భారత్‌లో కొత్త సిరీస్ మొబైళ్లను లాంచ్ చేసేందుకు వివో సిద్ధమైంది. టీ సిరీస్ ఫోన్‌లను ఫిబ్రవరిలో భారత్‌కు తీసుకురానుంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 9వ తేదీన మన దేశంలో వివో టీ1 5జీ (Vivo T1 5G) ఫోన్ విడుదల కానుంది. రూ.20వేలలోపు ఈ ఫోన్ స్లిమ్మెస్ట్, 5జీ ఫాస్టెస్ట్ ఫోన్ అని వివో పేర్కొంది. 8మిల్లీమీటర్ల కంటే ఈ ఫోన్ దక్కువ మందం ఉండే అవకాశం ఉంది. మరోవైపు వివో టీ1 5జీ.. మల్టీ డైమెన్షనల్ టర్బో పర్ఫార్మెన్స్ ఇస్తుందని, ట్రెండీ డిజైన్ ఉంటూ వివో చెబుతోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన విడుదల తేదీ వివరాలను అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో వివో ఇండియా పోస్ట్ చేసింది. కాగా ఈ మొబైల్ గత సంవత్సరం చైనాలో విడుదల కాగా.. ఇప్పుడు భారత్‌కు రానుంది.
Samayam Telugu వివో టీ1  (Photo: Vivo India)
Vivo T1 5G launch


భారత్‌లో ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)తో పాటు రిటైల్ స్టోర్లలో వివో టీ1 5జీ అమ్మకానికి వస్తుంది. చైనాలో ఈ మొబైల్ ప్రారంభ ధర 2,199 యెన్లు (దాదాపు రూ.25,800)గా ఉండగా.. మన దేశంలో రూ.20వేలలోపు ఉండే అవకాశం ఉంది.

వివో టీ1 5జీ స్పెసిఫికేషన్లు (Vivo T1 5G Specifications)
డిస్‌ప్లే: 120 హెట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.67 ఫుల్‌ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో ఈ ఫోన్ రానుంది.

ప్రాసెసర్: అలాగే క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్ ఈ మొబైల్‌లో ఉంటుంది. గరిష్ఠంగా 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ ఉంటుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12తో వివో టీ1 5జీ మొబైల్ లాంచ్ కానుంది.

కెమెరాలు: Vivo T1 5G మొబైల్ వెనుక మూడు కెమెరాల అమరిక ఉంటుంది. 64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉంటాయి. అలాగే వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండనుంది.

కనెక్టివిటీ: 5జీ, 4జీ ఎల్‌టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ Vivo T1 5Gలో కనెక్టివిటీ ఆప్షన్లుగా ఉండనున్నాయి.

బ్యాటరీ: వివో టీ1 5జీ మొబైల్ 5000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుండగా.. 44వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది.

Vivo T1 5G మొబైల్‌ను వివో ఏ ధరకు తీసుకొస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. రెడ్‌మీ నోట్ 11 సిరీస్ మొబైళ్లు విడుదల కానున్న రోజే.. ఈ ఫోన్ కూడా వస్తుండడం ప్రత్యేకంగా ఉండనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.