యాప్నగరం

వొడాఫోన్‌ నుంచి కొత్త లాంగ్ టర్మ్ ప్లాన్

ఈ కొత్త ప్లాన్‌కు ఫీచర్ ఫోన్ వినియోగదారులకు 168 రోజులు, స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు 112 రోజుల కాలపరిమితి విధించారు.

Samayam Telugu 22 Oct 2018, 2:55 pm
వొడాఫోన్‌ తన ప్రీపెయిడ్‌ వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ప్రధానంగా ఫీచర్ ఫోన్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ప్రకారం రూ.597తో రీఛార్జ్‌ చేసుకుంటే 168 రోజుల పాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌ను పొందవచ్చు. అదే విధంగా రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు, ఆఫర్‌ కాలంలో మొత్తం 10 జీబీ 3జీ/ 4జీ డేటాను పొందవచ్చని వొడాఫోన్‌ తెలిపింది. అయితే స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు ఈ ఆఫర్‌ కాలపరిమితి 112 రోజుల్లో ముగుస్తుంది.
Samayam Telugu vodafone1


తాజా ఆఫర్‌ కింద వినియోగదారులు రోజుకు 250 లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌ చేసుకోవచ్చు. అంటే 4 గంటలా 10 నిమిషాల పాటు టాక్‌టైమ్‌ లభిస్తుంది. అదే విధంగా వారానికి కేవలం 1000 నిమిషాలు మాత్రమే వినియోగించుకునే వీలుంది. వొడాఫోన్‌ అన్ని 4జీ సర్కిళ్లకూ ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఇప్పటికే ఎయిర్‌టెల్‌ ఈ ఆఫర్‌ను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఎయిర్‌టెల్ కూడా 168 రోజుల కాలపరిమితితో ఈ ప్లానును అందిస్తోంది. అన్‌లిమిటెడ్ కాల్స్‌తోపాటు.. 100 ఎస్సెమ్మెస్, 10జీబీ డేటాను అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్ యూజర్లకు 112 రోజుల కాలపరిమితి ఉంది.

మరోవైపు రోజుకు 1.5 జీబీ డేటా అందించే ప్లాన్లను కూడా వొడాఫోన్ తాజాగా లాంచ్ చేసింది. రూ.209, రూ.479, రూ.529లతో రిచార్జీ చేసుకుంటే రోజుకు 1.5 జీడీ అందననుంది. డేటాతోపాటు రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందిస్తోంది. ఈ ప్లాన్ల కాలపరిమితి వరుసగా.. 28 రోజులు, 84 రోజులు, 90 రోజులుగా ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.