యాప్నగరం

WhatsApp : మెసేజ్‌లు డిలీట్ చేసేందుకు మరింత సమయం! మరొకటి కూడా..

WhatsApp Delete for everyone : వాట్సాప్‌ మరో సదుపాయాన్ని యూజర్లకు తీసుకొచ్చేందుకు టెస్టింగ్ చేస్తోంది. డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్‌ టైమ్ లిమిట్‌ను భారీగా పెంచేందుకు పని చేస్తోంది. ఇది ఎలా ఉపయోగపడుతుందో చూడండి.

Authored byKrishna Prakash | Samayam Telugu 4 Jul 2022, 4:57 pm
వాట్సాప్‌ (WhatsApp) లో ఒకరికి పంపాల్సిన మెసేజ్ ఇంకొకరికి పంపినప్పుడు ఒక్కోసారి చాలా ఇబ్బందిగా మారుతుంది. లేకపోతే తప్పులతో మెసేజ్ సెండ్ చేసినా కష్టంగా ఉంటుంది. అయితే ఇలా తప్పుగా పంపిన మెసేజ్‌లను సెండ్ చేసిన తర్వాత రిసీవర్‌కు కూడా మీరే డిలీట్ చేసేలా వాట్సాప్‌ ఓ ఫీచర్‌ను చాలా కాలం క్రితమే తీసుకొచ్చింది. 2017లోనే డిలీట్ ఫర్ ఎవ్రీవన్ (Delete for everyone) ఫీచర్‌ను తీసుకొచ్చింది. మొదట్లో కేవలం 8 నిమిషాలు మాత్రమే ఈ సదుపాయం ఉంది. అంటే మెసేజ్ పంపిన 8 నిమిషాల్లోనే డిలీట్ చేసే అవకాశం ఉండేది. ఆ తర్వాత ఈ సమయాన్ని 1 గంట 8 నిమిషాల 16 సెకన్లకు పెంచింది. ప్రస్తుతం ఇదే కాల వ్యవధి ఉంది. ఈ సమయం ముగిసేలోగా సెండ్ చేసిన టెక్స్ట్, ఆడియో, వీడియోను డిలీట్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఫీచర్ కాలపరిమితిని మరింత పెంచేందుకు వాట్సాప్‌ సిద్ధమైంది.
Samayam Telugu WhatsApp New Feature


డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ద్వారా మెసేజ్‌లను డిలీట్ చేసేందుకు టైమ్ లిమిట్‌ను 2 రోజుల 12 గంటలకు వాట్సాప్‌ పెంచనుంది. ఈ విషయాన్ని వాట్సాప్‌ బీటా ట్రాకర్ డబ్ల్యూఏబీటాఇన్ఫో (WABetainfo) వెల్లడించింది. అంటే ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే తప్పుగా పంపిన మెసేజ్‌ను రెండు రోజుల తర్వాత కూడా మీరు డిలీట్ చేయవచ్చన్న మాట. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను వాట్సాప్‌ టెస్ట్ చేస్తోంది. కొందరు బీటా యూజర్లకు టెస్టింగ్ కోసం దీన్ని రోల్అవుట్ చేసింది. త్వరలోనే బీటా యూజర్లందరికీ అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత యూజర్లందరికీ అప్‌డేట్‌ ద్వారా ఈ కొత్త సదుపాయాన్ని వాట్సాప్‌ ఇస్తుంది.

అడ్మిన్‌ల కోసం..
డిలీట్‌కు సంబంధించిన మరో ఫీచర్‌ను కూడా వాట్సాప్‌ పరీక్షిస్తోంది. గ్రూప్‌లోని ఏ మెసేజ్, మీడియా ఫైల్ అయినా అడ్మిన్ డిలీట్ చేసే సదుపాయమే ఈ ఫీచర్. అంటే గ్రూప్‌లోని ఏ మెంబర్ పోస్ట్ చేసిన మెసేజ్‌నైనా అడ్మిన్ డిలీట్ చేయవచ్చన్న మాట. అయితే ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చేందుకు మరింత సమయం పట్టవచ్చు.
WhatsApp : ప్రొఫైల్ ఫొటో, లాస్ట్ సీన్ మీకు నచ్చని వారికి కనిపించకుండా సెట్ చేసుకోవచ్చు - ఎలానో చూడండిఆన్‌లైన్ స్టేటస్ ప్రైవసీ..
మరోవైపు ఆన్‌లైన్ స్టేటస్‌ కోసం ప్రైవసీ ఫీచర్‌ కూడా త్వరలో వాట్సాప్‌లో రానుంది. అంటే మీరు ఆన్‌లైన్‌లో ఉన్నారా లేదా అని ఎవరు చూడాలో మీరే ఎంపిక చేసుకోవచ్చు. ఇష్టం లేని కాంటాక్ట్‌లకు ఆన్‌లైన్ కనిపించకుండా సెట్ చేసుకోవచ్చు. ప్రొఫైల్ పిక్చర్, లాస్ట్ సీన్‌కు ఇటీవల ఇలాంటి ఫీచర్‌ను వాట్సాప్‌ తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ ప్రైవసీ ఫీచర్లు అందరికీ అందుబాటులోకి వచ్చాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.