యాప్నగరం

YouTube యాప్‌లో కీలకమార్పులు.. ఇక ఫుల్ స్క్రీన్‌లోనూ ఇవి చేయవచ్చు

యూట్యూబ్ యాప్ ఫుల్ స్క్రీన్ వీడియో ప్లేయర్‌కు కొత్త యూఐ వచ్చింది. ముఖ్యమైన కొన్ని బటన్లు యాడ్ అయ్యాయి.

Samayam Telugu 2 Feb 2022, 10:55 pm
YouTube యాప్‌లో మార్పులు వచ్చాయి. ఆండ్రాయిడ్ (Android), ఐఓఎస్ (IOS) యాప్‌ యూజర్ ఇంటర్ఫేస్ (UI)లో కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది యూట్యూబ్ (YouTube). ఫుల్‌స్క్రీన్‌లో వీడియో చూస్తున్నప్పుడు ఇవి చాలా ఉపయోగకరంగా ఉండనున్నాయి. వీడియో మినిమైజ్ చేయకుండానే ఫుల్ స్క్రీన్ వీడియో ప్లేయర్‌లోనే లైక్, డిస్‌లైక్ సహా మరిన్ని చేసే సదుపాయాలు వచ్చాయి. ఈ మేరకు YouTube వీడియో ప్లేయర్ యూఐలో వచ్చిన మార్పులు ఏంటంటే...
Samayam Telugu Youtube యాప్‌లో కీలకమార్పులు
YouTube Full Screen Video Player New UI

Also Read: ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే ఫీచర్.. ఏ వీడియోకైనా రీమిక్స్ చేయొచ్చు.. ఎలాగంటే?
యాప్‌లో వీడియోను ఫుల్ స్క్రీన్‌లో చూస్తున్నప్పుడు YouTube ప్లేయర్‌లో వచ్చిన మార్పులు కనిపిస్తాయి. వీడియో ప్లేయర్ యూఐలోనే లైక్, డిస్‌లైక్, కామెంట్, సేవ్ టూ ప్లే లిస్ట్, షేర్ అనే బటన్లు కనిపిస్తాయి. వీడియో ప్లేయర్ కింద ఎడమ కార్నర్‌లో ఇవి ఉంటాయి. ఇంతకు ముందు వీడియో లైక్ చేయాలన్నా, కామెంట్ చేయాలన్నా ఫుల్ స్క్రీన్ నుంచి మినిమైజ్ చేయాల్సి వచ్చేది. అయితే కొత్త యూఐ రావడంతో ఫుల్ స్క్రీన్‌ ఉండగానే వీడియోలకు కామెంట్లు చేయవచ్చు. అలాగే లైక్, డిస్‌లైక్ చేయవచ్చు. షేరింగ్ కూడా సులభతరమైంది.
Also Read: WhatsApp: పేటీఎం, గూగుల్, ఫోన్‌పేలకు గట్టి పోటీనిచ్చేలా వాట్సాప్ కొత్త ఫీచర్
వీడియో ప్లేయర్‌లో ఈ కొత్త యూఐ ఫీచర్లు ఇప్పటికే ఆండ్రాయిడ్, ఓఐఎస్ YouTube యాప్‌కు యాడ్ అయ్యాయి. మీ ఫోన్‌లో ఈ మార్పులను గమనించవచ్చు. ఒకవేళ ఇంకా రాకపోతే.. అతిత్వరలో ఈ యూఐ మార్పులు వస్తాయి. యాప్ అప్‌డేట్ చేసుకోకున్నా యూఐలో చేంజెస్ పొందవచ్చు.
Also Read: Free Fire, BGMIలకు పోటీగా రానున్న మేడ్ ఇన్ ఇండియా బ్యాటిల్ గేమ్.. వివరాలివే
కాగా, యూట్యూబ్ ప్రీమియమ్, యూట్యూబ్ మ్యూజిక్ కోసం వార్షిక ప్లాన్‌లను ఇటీవలే తీసుకొచ్చింది YouTube. బెస్ట్ వాల్యూ ఆఫర్‌గా సంవత్సరం ప్లాన్‌ను రూ.1,290కు అందుబాటులోకి తెచ్చింది. నెల ప్లాన్ ధర రూ.139 ఉండగా.. అదే మూడు నెలల ప్లాన్ ధర రూ.399గా ఉంది. ఒకవేళ యూట్యూబ్ ప్రీమియమ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలనుకునే వారికి వార్షిక ప్లా్న్ మంచి ఆప్షన్‌గా ఉంది. YouTube Premium ద్వారా ఎలాంటి యాడ్లు లేకుండా వీడియోలు చూడవచ్చు. అలాగే ప్రత్యేక కంటెంట్, బ్యాక్‌గ్రౌండ్ ప్లే, అన్ని రెజల్యూషన్స్‌లో వీడియో డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాలు వస్తాయి.
Also Read: Realme 9 Pro+ హృదయ స్పందనలు తెలిపే ఫీచర్‌తో రియల్‌మీ కొత్త ఫోన్.. ఆకట్టుకునే స్పెసిఫికేషన్లు
Also Read: Xiaomi: ఆ రోజే రెడ్‌మీ ధమాకా - రెండు ఫోన్లు, ఓ టీవీ లాంచ్‌తో పాటు
Also Read: Jio, Airtel, Vi: ప్రతీరోజు ఎక్కువ డేటా కావాలనుకుంటున్నారా.. ఈ ప్లాన్‌లు మీ కోసమే
Also Read: షియోమీ యూజర్లకు గుడ్‌న్యూస్.. రిపేర్ బుకింగ్ సహా అన్ని సర్వీస్‌లు ఒకే యాప్‌లో.. వివరాలు ఇవే

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.