యాప్నగరం

Aadhar and Pan Card Link మార్చి 31 వరకే డెడ్‌లైన్.. వెంటనే మీ ఆధార్‌కు పాన్‌కార్డు లింక్ చేసుకోండిలా...

Aadhar and Pan Card Link ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ఆధార్ కార్డుతో పాన్ కార్డులో కచ్చితంగా లింక్ చేయాలని భారత ప్రభుత్వం ప్రకటించింది. లేదంటే మీకు పెనాల్టీ తప్పదని హెచ్చరించింది.

Authored byఎస్.వెంకటేష్ | Samayam Telugu 17 Mar 2023, 7:33 pm
Aadhar and Pan Card Link మరికొద్ది రోజుల్లో ఆధార్‌కార్డు, పాన్‌కార్డ్ లింక్ గడువు తేదీ ముగియబోతోంది. మార్చి 31వ తేదీ సమీపిస్తున్నందున ప్రతి ఒక్కరూ ఆధార్, పాన్ కార్డులు రెండింటినీ తప్పనిసరిగా లింక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. లేదంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బ్యాంకు లావాదేవీలన్నీ తాత్కాలికంగా నిలిపివేయబడతాయని.. ఆదాయ పన్ను(Income Tax) సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
Samayam Telugu tech news


మన దేశంలో అస్సాం, జమ్మూ, కాశ్మీర్, మేఘాలయ వంటి రాష్ట్రాలు మినహా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు పాన్, ఆధార్ నెంబర్‌ను లింక్ చేయాలని, అన్ లింక్ చేయబడిన ఖాతాలన్నీ నిలిపేస్తామని భారత ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ రెండింటిని లింక్ చేసుకోండి. ఈ సందర్భంగా ఆధార్‌కార్డుకు పాన్‌కార్డును ఎలా లింక్ చేయాలి.. ఆన్‌లైనుతో పాటు SMS ద్వారా క్షణాల్లో ఎలా లింకు చేయాలనే పూర్తి వివరాలను స్టెప్ బై స్టెప్ ఇప్పుడే చూసెయ్యండి...

ఈ రెండు కార్డులను లింక్ చేయడానికి రూ.1000 వెయ్యి రూపాయలు చెల్లించాలని గుర్తుంచుకోండి. ఈ ప్రాసెస్ అంతా అధికారిక వెబ్‌సైటులోనే చేయాలి లేదా SMS ద్వారా కూడా చేయొచ్చు.

ఫోన్ ద్వారా ఎలా చేయాలంటే..
ముందుగా మీరు రిజిస్టర్ చేసుకున్న ఫోన్ నెంబర్ నుంచి 567678కి లేదా 56161 నెంబర్లకు ఇలా మెసెజ్ సెండ్ చేయాలి.

* మీ ఫోనులో UIDPAN అని టైప్ చేసి స్పేస్ ఇచ్చిన తర్వాత మీ 12 అంకెలుండే ఆధార్ నెంబర్ టైప్ చేసి.. స్పేస్ ఇచ్చి.. తర్వాత 10 అంకెలుండే పాన్‌కార్డు నంబర్ టైప్ చేయాలి.
* ఈ వివరాలన్నీ టైప్ చేసిన తర్వాత 567678కి లేదా 56161 రెండింట్లో ఏదో ఒక నెంబర్‌కు సెండ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ ఆధార్‌కార్డుకు పాన్ కార్డు లింక్ అవుతుంది.

ఉదాహరణకు మీ ఆధార్ నంబర్ 012345678901, పాన్ నెంబర్ ABCDE1234A అయితే..

UIDPAN 012345678901 ABCDE1234A
అని టైప్ చేసి పైన తెలిపిన రెండు నెంబర్లలో ఏదో ఒక దానికి సెండ్ చేయాలి.

గమనిక : ఆధార్‌తో పాన్‌కార్డు అనుసంధానం కోసం ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఆధార్, పాన్ కార్డులో రెండింట్లోనూ ఒకటే పేరు ఉండాలి. ఆ వివరాలు మ్యాచ్ అయితేనే మీ కార్డులు లింక్ అవుతాయి. ఈ రెండింట్లో పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇతర వివరాలు ఏ మాత్రం తేడాగా ఉన్నా తిరస్కరించబడుతుంది. కాబట్టి ముందుగా ఈ వివరాలన్నీ సరిచూసుకుని లింక్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి.

ఆన్‌లైనులోనూ అత్యంత సులభంగా..
మీ అరచేతిలో ఉండే ఫోనులో లేదా సిస్టమ్ నుంచి కూడా ఆధార్, పాన్‌కార్డులను సులభంగా లింక్ చేసుకోవచ్చు.

* ముందుగా https://www.incometax.gov.in/ వెబ్‌సైటులోకి వెళ్లాలి.
* హోమ్ పేజీలో ఎడమ వైపున ఉండే లింక్ ఆధార్ ఆప్షన్ ‌పై క్లిక్ చేయండి.
* మీ దగ్గర ఉండే పది అంకెల పాన్ నెంబరును అక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత కంటిన్యూపై క్లిక్ చేయాలి. అనంతరం ఇతర వివరాలు పూర్తి చేసి పాస్‌వర్డ్ సెట్ చేసుకోవాలి.
* ఆ తర్వాత మీ పాన్ ఐడి నెంబర్, పాస్‌వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఎంటర్ చేయాలి.
* లాగిన్ పేజీ ఓపెన్ అయ్యాక ఆధార్ లింకు కోసం మరో కొత్త విండో పేజీ ఓపెన్ అవుతుంది.
* అక్కడ పాన్‌కార్డులో ఉండే పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలన్నీ కనిపిస్తాయి. మీ ఆధార్, పాన్ కార్డులో వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి.
* అన్ని కరెక్టుగా ఉన్నాయని నిర్ధారించుకున్నాక లింక్ బటన్‌పై క్లిక్ చేయండి.
* ఆ తర్వాత పేమెంట్ కోసం మరో పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ ఆదాయ వివరాలను నమోదు చేయాలి. మీరు ఆదాయ పన్ను పరిధిలోకి రాకపోతే రూ.1000 వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
ఆ తర్వాత మీకు పాన్‌కార్డుకు ఆధార్ విజయవంతంగా లింక్ అయ్యిందనే వివరాలు కనిపిస్తాయి.

Read Latest Tech News and Telugu News
రచయిత గురించి
ఎస్.వెంకటేష్
ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి కొత్త విషయాలను, మిస్టరీలను, ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, క్రీడలు, ఫీచర్స్, లైఫ్‌స్టైల్(జీవన శైలి)కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.