యాప్నగరం

Whatsapp Stickersతో నూతన సంవత్సర శుభాకాంక్షలు.. ఇలా చెప్పండి!

మరికొద్ది గంటల్లో 2019కి గుడ్ బై చెప్పి 2020కి వెల్ కం చెప్పబోతున్నాం. ఈ సందర్భంగా కొత్త సంవత్సరం వస్తుందనే మన ఆనందాన్ని స్నేహితులు, కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పడం ద్వారా పంచుకుంటాం. అయితే ఈసారి వాట్సాప్ స్టిక్కర్లతో కాస్త కొత్తగా వారికి శుభాకాంక్షలు తెలపండి.

Samayam Telugu 31 Dec 2019, 2:45 pm
నూతన సంవత్సరం వచ్చిందంటే అందరితో ఉత్సాహం ఉవ్విళ్లూరుతోంది. కులమతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా జరుపుకునే అతికొద్ది వేడుకల్లో ఈ నూతన సంవత్సర వేడుకలు కూడా ఒకటి. ఈ సందర్భంగా మీ బంధుమిత్రులకు, స్నేహితులకు, కుటుంబసభ్యులకు, శ్రేయోభిలాషులకు రొటీన్ గా కాకుండా కాస్త కొత్తగా శుభాకాంక్షలు తెలపండి. ఎలా అనుకుంటున్నారా? మనం ఎప్పుడూ ఉపయోగించే వాట్సాప్ లో స్టిక్కర్లను పంపుకునే అవకాశం ఉంటుంది. వివిధ రకాల స్టిక్కర్లను పంపడం ద్వారా కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపవచ్చు అలా తెలపడానికి కింద తెలిపిన ప్రక్రియను ఫాలో అయిపోండి మరి!
Samayam Telugu New Project


Also Read: 2020లో ఈ ఫోన్లకు Whatsapp పనిచేయదు.. ఏయే ఫోన్లు అంటే?

వాట్సాప్ లో ఉన్న స్టిక్కర్ ఆప్షన్ ద్వారా మీరు న్యూఇయర్ స్టిక్కర్లను పంపించవచ్చు. ఆ వాట్సాప్ స్టిక్కర్లను ఇలా పొందాలి..

ఆండ్రాయిడ్ ఫోన్ లో అయితే ఇలా..

❂ గూగుల్ ప్లే స్టోర్ లో ‘Stickers For Whatsapp’ అని టైప్ చేస్తే అక్కడ మీకు చాలా యాప్ లు కనిపిస్తాయి. వాటిలో తెలుగుకు సంబంధించిన స్టిక్కర్లు అందించే యాప్ లు కూడా ఉంటాయి. వాటిలో మీకు నచ్చిన యాప్ ను డౌన్ లోడ్ చేసుకోండి. యాప్ ను డౌన్ లోడ్ చేసేముందు దాని రివ్యూలు, రేటింగులు కూడా చూసుకోండి.

❂ ఆ యాప్ లో న్యూఇయర్ వాట్సాప్ స్టిక్కర్లను డౌన్ లోడ్ చేసుకోండి.

❂ అనంతరం మీరు వాట్సాప్ ని ఓపెన్ చేస్తే ఎవరికి మెసేజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ల చాట్ ఓపెన్ చేసి కీబోర్డ్ ఓపెన్ చేయండి.

❂ పక్కనే కనిపించే స్మైలీ బటన్ పై క్లిక్ చేస్తే.. కింద మీకు స్మైలీ, జిఫ్, స్టిక్కర్ ఆప్షన్లు కనిపిస్తాయి. స్టిక్కర్ల మీద క్లిక్ చేస్తే కుడివైపు మీకు ఒక + బటన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీరు స్టిక్కర్లను యాడ్ చేసుకోవచ్చు.

❂ అక్కడ మీరు ముందుగా డౌన్ లోడ్ చేసుకున్న యాప్ లో ఉన్న స్టిక్కర్లను ఇక్కడ యాడ్ చేసుకుని మీకు నచ్చినవారికి పంపించవచ్చు.

Also Read: Google Pay న్యూ ఇయర్ స్టాంప్స్.. నేటితో ఆఖరు.. రూ.2020 వరకు గెలిచే అవకాశం!

ఐఫోన్ లో ఇలా..
ఐఫోన్ వినియోగదారులకు కూడా ఇలాంటి కొన్ని యాప్ లు అందుబాటులో ఉన్నాయి. లేకపోతే యాప్ స్టోర్ లో లభించే స్టిక్కర్ మేకర్ యాప్ ల ద్వారా మీకు నచ్చినవిధంగా స్టిక్కర్లను మీరే రూపొందించుకోవచ్చు కూడా. వీటిని ఉపయోగించుకోవడం ద్వారా ఐఫోన్ వినియోగదారులు కూడా తమకు నచ్చిన వారికి స్టిక్కర్ల ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపవచ్చు.

Also Read: నూతన సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్నారా? వీటి గురించి తెలుసుకోకపోతే మోసపోవడం ఖాయం!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.