యాప్నగరం

ఓటర్ లిస్ట్‌లో మీ పేరును ఆన్‌లైన్‌ ద్వారా ఎలా చెక్ చేసుకోవాలో తెలుసా?

ఓటరు లిస్ట్‌లో పేరుతో పాటు పోలింగ్ కేంద్రం, స్థానిక పోలింగ్ అధికారి ఎవరు అన్న వివరాలను ప్రజలు ఆన్‌లైన్‌లో స్వయంగా చెక్ చేసుకోవచ్చు. ఎలాగంటే..

Samayam Telugu 25 Jan 2022, 4:14 pm
దేశంలోని యువ ఓటర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు ప్రతీ సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని (National Voters' Day) భారత ఎన్నికల కమీషన్ (Election Commission of India) నిర్వహిస్తోంది. 18 సంవత్సరాలు నిండిన అందరూ ఓటు హక్కు కలిగి ఉండాలని, అర్హులందరూ ఓట్లు వేయాలని అవగాహన కల్పిస్తోంది. కాగా, ఓటర్లు తమ వివరాలను స్వయంగా ఆన్‌లైన్‌లో చెక్ చేసుకునే సదుపాయం కూడా అందిస్తోంది ఎన్నికల కమిషన్. ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో కూడా ప్రజలు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు.
Samayam Telugu ఓటర్ లిస్ట్‌లో మీ పేరును ఆన్‌లైన్‌ ద్వారా ఎలా చెక్ చేసుకోవాలో తెలుసా?
Nationa Voters Day 2022 Know How to check your name in Voter List via Online


కొత్తగా ఓటు హక్కు కోసం, సవరణల కోసం దరఖాస్తులు చేసుకున్న వారు తమ వివరాలు ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. అలాగే కొన్నిసార్లు ఓటర్ల జాబితాలోనూ సవరణలు జరుగుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లోనూ ఆన్‌లైన్‌లో వివరాలను ఓటర్లు చెక్ చేసుకోవాలి. ఏ పోలింగ్ కేంద్రాన్ని కేటాయించారు. తమ స్థానిక ఎన్నికల అధికారి ఎవరు అన్న వివరాలను కూడా చూసే అవకాశం ఉంది.

ఆన్‌లైన్‌లో ఓటరు జాబితాలోని మీ పేరును ఎలా చెక్ చేసుకోవాలంటే..
  • 1. ముందుగా బ్రౌజర్‌లో అధికారిక నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ వెబ్‌సైట్ www.nvsp.in లోకి వెళ్లాలి.
  • 2. వెబ్‌సైట్ ఓపెన్ అయ్యాక మెయిన్ పేజీలో సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్ (Search in Electoral Roll) అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • 3. ఆ ఆప్షన్ క్లిక్ చేశాక మరో పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో రెండు విధాలుగా ఓటర్ లిస్ట్‌లో మీ పేరును చెక్ చేసుకోవచ్చు.
  • 4. మొదటి ఆప్షన్ సెర్చ్ బై డిటల్స్‌లో.. మీ పేరు, వయసు/పుట్టిన తేదీ, రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం, తండ్రి/భర్త పేరు లాంటి వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత చివర్లో క్యాప్చా (Captcha) కోడ్‌ను అక్కడ ఉన్నట్టే ఎంటర్ చేయాలి. ఆ తర్వాత అక్కడే కింద ఉండే సెర్చ్ బటన్‌పై క్లిక్ చేస్తే ఓటరు జాబితాలో ఉన్న మీ వివరాలు వస్తాయి.
  • 5. ఒకవేళ మీ వద్ద ఓటరు కార్డు నంబర్ (EPIC Number) ఉంటే దాని ద్వారా కూడా ఓటరు లిస్ట్‌లో మీ వివరాలను చెక్ చేసుకోవచ్చు. అందుకోసం Search By EPIC No. అనే ఆప్షన్ అదే పేజీలో ఉంటుంది.
  • 6. అందులోకి వెళ్లి ఓటరు కార్డు నంబర్, రాష్ట్రం, అక్కడే ఉన్న కోడ్‌ను ఎంటర్ చేసి.. సెర్చ్ బటన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఓటర్ లిస్ట్‌లోని మీ పేరు వివరాలు వస్తాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.