యాప్నగరం

మీ Twitter అకౌంట్‌ను భద్రంగా ఉంచుకోండిలా.. Hack కాకుండా సూచనలు పాటించండి..

Twitter Account Security Tips: మీ ట్విట్టర్ అకౌంట్‌ హ్యాకర్ల బారిన పడకుండా సురక్షితంగా ఉంచుకోవాలనుకుంటున్నారా.. అయితే కొన్ని టిప్స్ పాటించాలి. ఈ సూచనలను అనురించడం ద్వారా ట్విట్టర్ ఖాతాను భద్రంగా ఉంచుకోవచ్చు. అవేంటంటే..

Samayam Telugu 22 Jan 2022, 1:38 pm
మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌ ట్విట్టర్ (Twitter)ను కోట్లాది మంది వాడుతున్నారు. తమ అభిప్రాయాలను, సమాచారాన్ని, ఫొటోలను పంచుకుంటున్నారు. ప్రముఖుల దగ్గరి నుంచి సామాన్యుల వరకు దాదాపు స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్న వారందరికీ ట్విట్టర్ అకౌంట్‌ (Twitter Account) ఉంటుంది. చాలా మంది నిత్యం పోస్ట్ లు చేస్తుంటారు. అయితే, ఇటీవల ట్విట్టర్ ఖాతాలను సైబర్ క్రిమినల్స్ టార్గెట్ చేస్తున్నారు. అకౌంట్‌లను హ్యాక్ చేస్తున్నారు.
Samayam Telugu secure your twitter account from hackers with these steps and stay safe on social media
మీ Twitter అకౌంట్‌ను భద్రంగా ఉంచుకోండిలా.. Hack కాకుండా సూచనలు పాటించండి..


గతంలో చాలా మంది ప్రముఖుల ట్విట్టర్ అకౌంట్‌లు కూడా హ్యాక్ అయ్యాయి. ఇక సాధారణ యూజర్ల ఖాతాలను కూడా తరచూ హ్యాకింగ్‌ కు గురవుతున్నాయనే సమాచారం బయటికి వస్తోంది. ఇలాంటి తరుణంలో ట్విట్టర్ ఖాతాను సురక్షితంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని సూచనలు పాటిస్తే అకౌంట్‌ హ్యాకింగ్‌ కు గురి కాకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ సూచనలు పాటిస్తే.. ట్విట్టర్ అకౌంట్‌ను సురక్షితంగా మార్చుకోవచ్చు.

​ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌ (Unique and Strong Password)

Twitter అకౌంట్‌కు వీలైనంత సుదీర్ఘమైన, బలమైన పాస్‌వర్డ్‌ సెట్ చేసుకోవాలి. అంటే కాస్త క్లిష్టంగా ఉండే పాస్‌వర్డ్‌ ఉండాలి. ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో వినియోగించని పాస్‌వర్డ్‌ సెట్ చేసుకుంటే ట్విట్టర్ ఖాతా మరింత సురక్షితంగా ఉంటుంది. అలాగే పాస్‌వర్డ్‌లో అప్పర్ కేస్, లోయర్ కేస్, నంబర్లు, సింబల్స్ అన్నీ ఉండాలి. ఫోన్‌ నంబర్‌, డేట్ ఆఫ్ బర్త్, 1234 లాంటి వరుసగా వచ్చే అక్షరాలతో పాస్‌వర్డ్‌ అసలు ఉండకూడదు.

​టూ ఫ్యాక్టర్ అథంటికేషన్ (Two Factor Authentication)ను వినియోగించాలి

Twitter Accountకు టూ ఫ్యాక్టర్ అథంటికేషన్ అదనపు సెక్యూరిటీ అందిస్తుంది. సెక్యూరిటీ సెట్టింగ్స్ లో దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. దీన్ని ఆన్ చేశాక.. యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ ఎంటర్ చేయడంతో పాటు సెకండరీ లాగిన్ వివరాలను కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే లాగిన్ పూర్తవుతుంది. దీని ద్వారా ఒకవేళ హ్యాకర్లు మీ పాస్‌వర్డ్‌ ను కనుగొన్నా.. వారు ఖాతాను యాక్సెస్ చేయలేరు. ఈ వెరిఫికేషన్ ఎనేబుల్ చేసుకుంటే లాగిన్ అయినప్పుడు మీ ఫోన్‌కు కోడ్ లేదా మీ డివైజ్ కు నోటిఫికేషన్ వస్తుంది. ఇది ఒకే చేస్తేనే లాగిన్ అవుతుంది.

​ఫిషింగ్ (Phishing)తో జాగ్రత్త

ట్విట్లు, ఈమెయిల్స్, డైరెక్ట్ మెసేజ్ ల ద్వారా ప్రైవేటు సమాచారాన్ని కొల్లగొట్టేందుకు హ్యాకర్లు ప్రయత్నిస్తారు. అందుకే మెసేజ్ లు, అనుమానాస్పద లింక్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. వివరాలు సమర్పించాలంటూ ఏవైనా లింక్స్ వస్తే జాగ్రత్త పడాలి. వాటి ద్వారా ట్విట్టర్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ టైప్ చేసి లాగిన్ వివరాలు ఎంటర్ చేయకూడదు.

​ఇలాంటివి నమ్మకూడదు

ఎక్కువ మంది మీ ఖాతాను ఫాలో అయ్యేలా చేస్తామని, మానిటరీ బెనిఫిట్స్ కల్పిస్తామంటూ కొందరు మెసేజ్ లు పంపిస్తుంటారు. అలాంటి వారికి ఎట్టిపరిస్థితుల్లోనూ Twitter ఖాతా లాగిన్ వివరాలను ఇవ్వకూడదు.

​సెక్యూర్ డివైజెస్ లో వాడడం

మీకు తరచూ వాడే సొంత మొబైల్స్, ట్యాబెట్లు, కంప్యూటర్లలోనే ట్విట్టర్ వాడడం సురక్షితం. కొత్తగా వేరే డివైజెస్ లో ఎక్కువగా లాగిన్ అవడం మంచిది కాదు. ఒకవేళ వేరే వాటిలో ట్విట్టర్ వాడితే లాగ్అవుట్ చేయడం అసలు మర్చిపోకూడదు. అలాగే మీ డివైజెస్ ఆపరేటింగ్ సిస్టమ్స్, యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాలి.

​రివ్యూ అలర్ట్ (Review Alert) లను పరిశీలిస్తుండాలి

కొత్త డివైజ్ లో మొదటిసారి లాగిన్ అయినప్పుడు ట్విట్టర్.. పుష్ నోటిఫికేషన్ లేదా ఈమెయిల్ తప్పకుండా పంపుతుంది. ఇది కూడా సెక్యూరిటీలో భాగమే. అందుకే మీ ట్విట్టర్ ఖాతా లాగిన్ కు సంబంధించిన మెయిల్స్ ఏమైనా వచ్చాయేమో అప్పుడప్పుడు చెక్ చేసుకుంటుండాలి. అలాగే ట్విట్టర్ కోసం వినియోగించిన కాంటాక్ట్స్ వివరాలు మార్చినా అలర్ట్ వస్తుంది. వీటిని అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.