యాప్నగరం

పుట్టింటోళ్లతో మాట్లాడినా.. రావడం లేటైనా.. రోజూ కొడుతున్న భార్య, పాపం భర్త.. చివరికి..

ముస్తాఫా వారం రోజులు ఆస్పత్రిలో ప్రాణాల కోసం పోరాడి చనిపోయాడు. అతని ఫోన్‌లో వీడియోలు చూసి బంధువులు షాక్‌కి గురయ్యారు. కర్రలు, కుర్చీలతో భర్తని చావబాదుతున్న భార్యని చూసి కంగుతిన్నారు. ఆమే చంపేసిందా? భార్యని భరించలేక తానే చనిపోయాడా?

Samayam Telugu 10 Dec 2021, 9:53 pm

ప్రధానాంశాలు:

  • ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త మృతి
  • సెల్‌ఫోన్‌లో వీడియోలు చూసి బంధువులు షాక్
  • కర్రలు, కుర్చీలతో చితక్కొడుతున్న భార్య
  • ఆమే చంపేసిందని ఆరోపణలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
wife torture
రోజూ తాగొచ్చి చితకబాదడం.. పుట్టింటోళ్లతో మాట్లాడినా.. అదనపు కట్నం తీసుకురాకపోయినా రాచిరంపాన పెట్టడం.. ఆడపిల్ల పుట్టిందని వదిలేయడం లాంటి భర్తలు చేసే దారుణాలకు కొదువేలేదు. అయితే ఇక్కడ సీన్ రివర్స్! నిత్యం ఏదో ఒక సాకుతో భర్తని రోజూ చితక్కొడుతున్న భార్య బాగోతం వెలుగుచూసింది. పేరెంట్స్‌తో మాట్లాడినా.. పని నుంచి ఇంటికి ఆలస్యంగా వచ్చినా శివాలెత్తిపోయేదామె. చేతికందిన వస్తువుతో భర్తని చావబాదేది. కన్నబిడ్డల ముందే తండ్రిని తల్లి చితకబాదేది.
తీరా ఒకరోజు అనూహ్యంగా పురుగుల మందు తాగి భర్త అచేతనంగా పడిపోయాడు. ఆస్పత్రిలో వారం రోజులు పోరాడి ప్రాణాలు విడిచాడు. ఇంతకీ.. గయ్యాళి భార్య దెబ్బలు భరించలేక ఆత్మహత్యాయత్నం చేశాడా? లేక భార్యే బలవంతంగా పురుగుల మందు తాగించిందా? ఈ అంతుచిక్కని మిస్టరీ మంచిర్యాల జిల్లాలో వెలుగుచూసింది.

సీసీసీ నస్పూర్‌కి చెందిన ముస్తఫా, రుబీనా భార్యాభర్తలు. కట్టుకున్న భర్తని రుబీనా నిత్యం కొడుతుండేదని తెలుస్తోంది. కన్నబిడ్డల ముందే తండ్రిని తల్లి చితకబాదేది. కర్రలు, రాడ్లతో విచక్షణా రహితంగా కొడుతూ సైకోయిజం చూపించేది. ముస్తఫా తన తల్లిదండ్రులతో మాట్లాడినా.. గని నుంచి ఆలస్యంగా ఇంటికొచ్చినా దారుణంగా కొట్టేదని సమాచారం. ఈ నెల 2వ తేదీన కూడా మరోమారు భర్తని చావబాదిందని.. కర్రలు, రాడ్లతో కొట్టి పురుగుల మందు తాగించి హత్యాయత్నం చేసిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

అతని పరిస్థితి విషమించడంతో హుటాహుటిన మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించి భార్య రుబీనా అక్కడి నుంచి జారుకుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వారం రోజుల అనంతరం తన కొడుకు చనిపోయాడని ముస్తఫా తల్లి కన్నీరుమున్నీరవుతోంది. తన కొడుకును విచక్షణా రహితంగా కొట్టి.. పురుగుల మందు తాగించి కోడలు రుబీనా చంపేసిందని ఆరోపించింది.

అయితే ముస్తాఫా మరణానంతరం సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన భార్య రుబీనా తనను కొడుతున్నప్పుడు తీసుకున్న వీడియోలు సెల్‌ఫోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కర్రలు, కుర్చీలతో విచక్షణా రహితంగా దాడి చేసి చిత్రహింసలకు గురిచేస్తున్న వీడియోలు బయటికొచ్చాయి. తన భార్య తనను నిత్యం చావబాదతోందంటూ ముస్తఫా చెబుతున్న సెల్ఫీ వీడియోలను చూసి బంధువులు సైతం షాక్‌కి గురిచేస్తున్నాయి. అసలు ఏం జరిగిందనేది పోలీసు విచారణలో తేలాల్సి ఉంది. ముస్తఫా బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.