యాప్నగరం

ఆదిలాబాద్‌లో వింత పెళ్లి, ఇదో విచిత్రం.. ఏలాగో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు!

Adilabad: వెల్మ అర్జున్‌ అనే వ్యక్తి, వరుసకు మరదళ్లయిన సురేఖ, ఉషారాణి గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇద్దరు మరదళ్ళు కూడా తనను ప్రేమిస్తున్నారని గ్రహించిన వరుడు అర్జున్ ఇద్దరితో చర్చించాడు.

Samayam Telugu 18 Jun 2021, 6:13 pm

ప్రధానాంశాలు:

  • ఆదిలాబాద్‌లో ముక్కోణపు పెళ్లి
  • మరదళ్లను పెళ్లి చేసుకున్న బావ
  • పెద్దల సమక్షంలోనే వివాహం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ​ఇద్దర్నీ పెళ్లాడిన వ్యక్తి​
Adilabad marriage
Utnoor: అదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలో ఓ వింత పెళ్లి జరిగింది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా ట్రయాంగిల్ పెళ్లి ఇది. ఈ ముక్కోణపు పెళ్లి ప్రేమ వివాహం కావడం విశేషం. వరుడు ఒక్కడే కానీ, వధువులు ఇద్దరు. ప్రేమించిన ఇద్దరు అమ్మాయిల్ని ఓకేసారీ ఒకే పెళ్లి మండపంలో అదికూడా పెద్దల అంగీకారంతో వారి సమక్షంలో వరుడు తాళి కట్టాడు. ఈ లాంటి లవ్ స్టోరీలు సినిమాలలో ఎన్నో చూశాం. కానీ ఈ నిజమైన లవ్ స్టోరీ కం పెళ్లి రియల్‌గా చూడాలంటే అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం ఘన్‌పూర్ వెళ్ళాల్సిందే.
వెల్మ అర్జున్‌ అనే వ్యక్తి, వరుసకు మరదళ్లయిన సురేఖ, ఉషారాణి గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇద్దరు మరదళ్ళు కూడా తనను ప్రేమిస్తున్నారని గ్రహించిన వరుడు అర్జున్ ఇద్దరితో చర్చించాడు. పైగా ముగ్గురు డిగ్రీ పూర్తిచేశాడు. ఈ విషయం కాస్త కుటుంబ సభ్యులకు, గ్రామ పెద్దల వరకు వెళ్లింది.

ఇద్దరినీ ఆ యువకుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి మొదట కుటుంబ సభ్యులు, బంధువులు పెద్దలు వ్యతిరేకించినప్పటకీ, ముగ్గురు పట్టు వీడలేదు. ఇక చేసేది లేకపోవడంతో ఆ ముగ్గురికి పెద్దలు పెళ్లి కుదిర్చారు. ఘన్పూర్ గ్రామంలో బాజా బజంత్రీలు, గిరిజన సంప్రదాయం ప్రకారం పెళ్లి మండపంలో ఘనంగా శుక్రవారం పెళ్ళి చేశారు. ఈ పెళ్లి ఇప్పుడు ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలో చర్చనీయాంశం అయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.