యాప్నగరం

ప్రేమ పేరుతో మోసం చేసింది.. యువతి ఇంటి ముందు యువకుడి నిరసన

Mancherial Man Protest infront of Girl's Home: ప్రేమ పేరుతో ఓ యువతి తనను మోసం చేసిందంటూ మంచిర్యాలకు చెందిన ఓ యువకుడు ఆందోళనకు దిగాడు. అమ్మాయి ఇంటి ముందు బైఠాయించాడు. తనకు న్యాయం జరిగేంత వరకు అక్కడ నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పాడు. తాను, సదరు యువతి ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నామని, ఆమె కోసం తాను రూ. 5 లక్షల వరకు ఖర్చు చేశానని యువకుడు చెబుతున్నాడు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 20 Aug 2022, 12:41 am
ప్రియుడు మోసం చేశాడంటూ ప్రియురాలు నిరసన చేసిన ఘటనలు అనేకం చూశాం. కానీ, మంచిర్యాల (Mancherial) జిల్లాలో దీనికి పూర్తి భిన్నమైన ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి తాను ప్రేమ పేరుతో మోసం చేసిందంటూ ధర్నాకు దిగాడు. యువతి ఇంటి ముందు బైఠాయించాడు. న్యాయం జరిగేంత వరకు అక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశాడు. మంచిర్యాల జిల్లాకు చెందిన చాతరాజు ప్రవీణ్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. తామిద్దరం 2015 నుంచి ప్రేమించుకుంటున్నామని అతడు చెప్పాడు. ఏడేళ్లుగా చెట్టాపట్టాలేసుకొని తిరిగామని, ఆమె ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా తన సాయం కోరేదని తెలిపాడు. కలిసి తిరిగి, పెళ్లి చేసుకుందామని ఆశలు రేపి.. ఇప్పుడు వేరే కులం అని ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడంలేదని చెప్పి మరో యువకుడితో పెళ్లికి సిద్ధమైందని ఆరోపిస్తున్నాడు ప్రవీణ్.
Samayam Telugu Love cheating
ప్రేమ పేరుతో మోసం


అడిగినప్పుడల్లా కాదనకుండా డబ్బు కూడా ఇచ్చానని, బంగారు నగలు కానుకగా ఇచ్చానని ప్రవీణ్ చెబుతున్నాడు. ఇలా ఇప్పటి వరకు రూ.5 లక్షల వరకు ఖర్చు చేశానని అంటున్నాడు. ఇద్దరు కలిసి దిగిన ఫొటోలు పట్టుకుని ఆమె ఇంటి ముందు ధర్నాకు దిగాడు. యువతి తన తల్లి, అక్కకు భయపడి వేరే పెళ్లి చేసుకుంటోందని ఆరోపిస్తున్నాడు. తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు.

Also Read:

ఆమెకు వడ్డానం చేయించి ఉంటే ఆనాడే మంత్రి అయ్యేవాణ్ని: ఎర్రబెల్లి

బ్యాంక్ దోపిడీకి సొరంగం.. ఊహించని ప్రమాదం, 8 గంటలు శ్రమించి కాపాడిన పోలీసులు
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.