యాప్నగరం

రోడ్లపై మిర్చిబజ్జీ, బోండాలు తింటున్నారా?.. తస్మాత్ జాగ్రత్త!

Asifabad Food Poison: కొమురం భీం జిల్లా తిర్యానీ మండల కేంద్రంలో నిర్వహించిన సంతలో బజ్జీలు తిని పలువురు అస్వస్థతకు గురయ్యారు. మెుత్తం 60 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలయ్యారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 13 May 2023, 8:16 pm

ప్రధానాంశాలు:

  • కొమురం భీం జిల్లాలో ఫుడ్ పాయిజన్
  • సంతలో బజ్జీలు తిని పలువురికి అస్వస్థత
  • ఆసుపత్రిలో చేరిన 60 మంది బాధితులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu asifabad food poison
ఫుడ్ పాయిజన్
Food Poison: ఎప్పుడైనా బయటకు వెళితే స్ట్రీట్ ఫుడ్ మనల్ని టెంప్ట్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా నూడిల్స్, పానీపూరి, మిర్చిబజ్జీ వంటివి తీనాలనిపిస్తూ ఉంటుంది. పల్లెటూళ్లలో సంతలు నిర్వహించే చోట కూడా సంతకు వెళ్లిన వాళ్లు మిర్చిబజ్జీ, బోండాలు, సమోసాలు వంటికి కొనుక్కొని తింటూ ఉంటారు. అయితే అలాంటి ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. వారు వాడే నూనే, వాటిని తయారు చేసే విధానం, అపరిశుభ్రత కారణంగా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది. వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వాడి బోండాలు, బజ్జీలు వంటివి తయారు చేస్తూ ఉంటారు. వాటిని తినటం వల్ల పుడ్ పాయిజన్ అయి ఆసుపత్రిల్లో చేరిన ఘటనలు అనేకం.
తాజాగా.. కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో బజ్జీలు, బోండాలు తిని పలువురు అస్వస్థకు గురయ్యారు. సంతలో అమ్మిన తినుబండారాలు తిని.. ఆసుపత్రుల పాలయ్యారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని తిర్యానీ మండల కేంద్రంలో ప్రతీ రోజూ శుక్రవారం సంత నిర్వహిస్తారు. ఆ సంతకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి తమకు కావాల్సిన కురగాయులు, వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. తాండూర్ నుంచి వచ్చే ఓ వ్యక్తి మిర్చి బజ్జీలు, బోండాలు సంతలో అమ్ముతుంటాడు. ఎప్పటిలానే కొందరు ఆ సంతలో అతడి దగ్గర మిర్చిబజ్జీలు, బోండాలు కొనుక్కుని ఇంటికి తీసుకెళ్లారు.

ఇంటికి వెళ్లాక వాటిని లొట్టలేసుకుంటూ తిన్నారు. ఇక అంతే.. రాత్రయ్యేసరికి వాటిని తిన్న వారు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటివరకు బజ్జీలను తిన్న 60 మంది వరకు ఆసుపత్రిలో చేరారు. విషపూరితమైన ఆహారం తినటం వల్లే వీరు వాంతులు, విరేచనాలు చేసుకున్నారని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. బయట ఫుడ్ తినేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని తినాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కల్తీ ఆహారం వల్ల ఆసుపత్రుల పాలయ్యే ప్రమాదం ఉంటుందని.., కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.