యాప్నగరం

Swine Flu Case In Adilabad: ఆదిలాబాద్‌లో స్వైన్ ఫ్లూ కేసు నమోదు..

Swine Flu Case In Adilabad: ఆదిలాబాద్ పట్టణంలో తొలి స్వైన్ ఫ్లూ కేసు నమోదైంది. జ్వరంతో బాధపడుతున్న ఓ రోగికి టెస్టులు చేయగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఏజెన్సీలో చాలా మంది వైరల్ ఫీవర్లతో బాధపడుతున్నారు. వీరికి టెస్టులు చేస్తే.. స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య పెరగొచ్చనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

Authored byరవి కుమార్ | Samayam Telugu 14 Aug 2022, 7:09 am

ప్రధానాంశాలు:

  • ఆదిలాబాద్‌లో స్వైన్ ఫ్లూ కేసు నమోదు
  • రిమ్స్‌లో చికిత్స పొందుతున్న పేషెంట్‌కు టెస్టులు
  • పాజిటివ్‌గా తేలడంతో ఆందోళన
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Swine Flu
Swine Flu
ఆదిలాబాద్ జిల్లాలో తొలి స్వైన్ ఫ్లూ కేసు నమోదైంది. రిమ్స్‌లో చికిత్స పొందుతున్న పేషెంట్‌కు స్వైన్ ఫ్లూ సోకిందని నిర్ధారించారు. జ్వరంతో బాధపడుతున్న పేషెంట్‌కు అనుమానంతో టెస్టులు చేయగా.. స్వైన్ ఫ్లూ సోకినట్లు తేలింది. రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కాగా చాలా మంది స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నాయని.. దీంతో స్వైన్ ఫ్లూ బాధితుల సంఖ్య పెరగొచ్చనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సీజన్లో ఏజెన్సీలో జ్వరం బాధితుల సంఖ్య పెరుగుతోంది. వీరిలో చాలా మందికి ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు. వైరల్ ఫీవర్ బాధితులు ఎక్కువగా ప్రయివేట్ హాస్పిటళ్లలో చేరుతున్నారు. దీంతో చికిత్స అందించే సమయంలో కరోనా మార్గదర్శకాలను పాటించడం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
జ్వరం కేసుల వివరాలను ప్రయివేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలు ప్రభుత్వానికి నివేదించడం లేదని సమాచారం. ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో చేరుతున్న బాధితుల వివరాలు మాత్రమే ప్రభుత్వానికి తెలుస్తున్నాయి. ఉట్నూరులోని కేజీబీవీ రెసిడెన్షియల్ స్కూల్‌లో చదువుతున్న ఆత్రం కవిత అనే 15 ఏళ్ల విద్యార్థిని రిమ్స్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది. అంతకు రెండు రోజుల ముందు హాస్టల్ సిబ్బంది ఆమెను రిమ్స్‌కు తరలించారు.

వైద్యారోగ్య శాఖ ఇప్పటి వరకూ కోవిడ్‌పైనే శ్రద్ధ పెట్టగా.. ఇకపై స్వైన్ ఫ్లూ కేసుల విషయంలోనూ శ్రద్ధపెట్టాల్సిన అవసరం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో టీబీ కేసులు కూడా పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.