యాప్నగరం

హైదరాబాద్‌లో కోతి వీరంగం.. 5 ఏళ్ల చిన్నారిపై దాడి.. తప్పిన పెను ప్రమాదం

Rajendra Nagar: ఇప్పటికే రాష్ట్రంలో వీధి కుక్క దాడి ఘటనలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తుండగా.. ఇప్పుడు కోతులు హల్‌చల్ చేస్తోన్నాయి. ఒక బాలుడిపై కోతి దాడికి పాల్పడింది. అయితే ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Authored byవెంకట్రావు లేళ్ల | Samayam Telugu 9 Apr 2023, 10:16 pm

ప్రధానాంశాలు:

  • హైదరాబాద్‌లో వీరంగం సృష్టించిన కోతి
  • ఐదేళ్ల చిన్నారిపై దాడి
  • సీసీ టీవీలో రికార్డు అయిన విజువల్స్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu moneky
కోతి
Rajendra Nagar: రాజేంద్రనగర్‌లో ఓ కోతి వీరంగం సృష్టించింది. హైదర్‌గూడలో ఒక కోతి హల్‌చల్ చేసింది. ఇద్దరు పిల్లలు ఒంటరిగా వెళుతున్న సమయంలో దాడికి పాల్పడింది. 5 సంవత్సరాల బాలుడిపై దాడి చేసి కాళ్ళు పట్టుకుంది. కాళ్లు లాగి కరచి కింద పడేసి బెదిరించింది. ఒక్కసారిగా భయబ్రాంతులకు గురైన అక్కాతమ్ముడు గట్టిగా కేకలు వేస్తూ వెంటనే ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. దీంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది.
చిన్నారుల కేకలు విన్న ఓ యువతి వెంటనే ఇంట్లోకి వెళ్లిపోయింది. మెట్లపై దర్జాగా కూర్చున్న కోతిని యువతి వెళ్లగొట్టి తలుపులు తెరచింది. దీంతో కోతి గోడ ద్వారా దర్జాగా ఇంట్లోకి వెళ్లిపోయింది. కోతిని గమనించకుండా కీర్తన్ అనే చిన్నారి ఇంట్లోకి వెళ్లిపోయాడు. దీంతో ఆ చిన్నారిపై కోతి దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీంతో ఆ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అయితే రాష్ట్రంలో తరచూ వీధి కుక్క దాడి ఘటనలు ఆందోళన కల్గిస్తున్నాయి. కుక్కల దాడి ఘటనలో వందల మంది గాయపడుతున్నారు. వీధి కుక్కల దాడి ఘటనల్లో చిన్నారులు గాయపడుతున్నారు. చిన్నారుల నుంచి పెద్దవారి వరకు వీధి కుక్కల బారి పడుతున్నారు. రాష్ట్రంలో రోజూ ఎక్కడో ఒకచోట వీధి కుక్కల దాడి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు కోతులు దాడి ఘటనలు భయానికి గురి చేస్తోన్నాయి. దీంతో వీధి కుక్కలు, కోతుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
రచయిత గురించి
వెంకట్రావు లేళ్ల
వెంకట్రావు లేళ్ల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్‌డేట్స్, పొలిటికల్ అనాలసిస్ అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.