యాప్నగరం

Hyderabad సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం.. విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం

Hyderabad: ఇటీవల హైదరాబాద్‌లో అత్యాచారం, అత్యాచారయత్నం ఘటనలు పెరిగిపోతున్నాయి. రోజూ ఏదోక స్కూల్, కాలేజీలలో ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల ఓ స్కూల్‌లో ఓ విద్యార్థినిపై నలుగురు విద్యార్థులు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన సంచలనం రేపింది. తాజాగా హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నానికి పాల్పడిన ఉదంతం కలకలం సృష్టిస్తోంది. ప్రొఫెసర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, శిక్ష పడేలా చేయాలని మహిళా సంఘాలు, విద్యార్థులు కోరుతున్నారు.

Authored byవెంకట్రావు లేళ్ల | Samayam Telugu 3 Dec 2022, 11:45 am

ప్రధానాంశాలు:

  • హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం
  • విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం
  • గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో యువతి ఫిర్యాదు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu rape attempt
అత్యాచారయత్నం
Hyderabad: హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థినిపై ప్రొఫెసర్ రవిరంజన్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. థాయ్‌లాండ్‌కి చెందిన విద్యార్థినిపై ఆయన అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. ప్రొఫెసర్ నుంచి తప్పించుకుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో విద్యార్థిని శనివారం ఫిర్యాదు చేసింది. దీంతో అత్యాచారయత్నానికి ప్రయత్నించిన ప్రొఫెసర్ రవిరంజన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.
ప్రతిష్టాత్మక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థినిపై అత్యాచారయత్నం చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. ప్రొఫెసర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తోన్నారు. ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో ఇలాంటి ఘటనలు వద్యార్థినులను భయపెట్టేలా ఉన్నాయని కొంతమంది అంటున్నారు. అంత పెద్ద యూనివర్సిటీలో విద్యార్థినులకు భద్రత లేకపోవడం ఆందోళన కలిగించే అంశమని ఆరోపణలు వస్తోన్నాయి.

ఈ కేసులో గచ్చిబౌలి పోలీసులు ప్రొఫెసర్ రవిరంజన్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే చర్చనీయాంశంగా మారింది. అత్యాచారయత్నం కేసులో ఆయనను అరెస్ట్ చేస్తారా? ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనేది హాట్‌టాపిక్‌గా మారింది. ప్రొఫెసర్ రవిరంజన్‌ను అరెస్ట్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తోన్నారు. అలాంటివారి వల్ల యూనివర్సిటీ ప్రతిష్ట దెబ్బతీనే అవకాశముందని, కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఈ ఘటనతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆందోళనలు నెలకొన్నాయి. విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం ఘటనకు సంబంధించి యూనివర్సిటీ అధికారులు ఆరా తీస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకున్నారు. బాధితురాలి స్టేట్‌మెంట్ రికార్డు చేసి వైద్య పరీక్షల కోసం ఆమె ఆస్పత్రికి తరలిస్తున్నారు. బుక్ కోసం క్యాంప్ బయటకు పిలిచి అత్యాచారం చేయడానికి ప్రయత్నించారని, ప్రొ.రవిరంజన్‌ను అదుపులోకి తీసుకుంటామని డీసీపీ శిల్పవల్లి స్పష్టం చేశారు. అటు సెంట్రల్ యూనివర్సిటిలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Read More Telangana News And Telugu News
రచయిత గురించి
వెంకట్రావు లేళ్ల
వెంకట్రావు లేళ్ల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్‌డేట్స్, పొలిటికల్ అనాలసిస్ అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.