యాప్నగరం

ACB వలలో లంచావతారం.. రెడ్‌హ్యాండెడ్‌గా బుక్కైన సబ్ రిజిస్ట్రార్

భూమి డాక్యుమెంట్ల వ్యవహారం తేలాలంటే తనకు లంచం ఇవ్వాల్సిందేనని.. లేకుంటే పని జరగదని తేల్చి చెప్పేశాడా సబ్ రిజిస్ట్రార్. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో అవినీతి అధికారి పాపం పండింది.

Samayam Telugu 21 Oct 2021, 10:01 pm
ప్రభుత్వ ఉన్నతోద్యోగం.. లక్షల్లో జీతం.. అయినా కొందరు అక్రమార్కులు ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్నారు. చేయి తడపనిదే పని చేయమంటూ నేరుగా చెప్పేస్తున్నారు. లక్షలు లంచం ముట్టజెబితే కానీ పనికాదని తెగేసి చెప్పడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. లంచావతారం డబ్బులు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
bribe


రాజేంద్ర నగర్ సబ్ రిజిస్ట్రార్ హర్షద్ అలీ ఏసీబీ వలకు చిక్కాడు. ఏకంగా ఐదున్నర లక్షల రూపాయలు లంచంగా తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు. రాజేంద్ర నగర్ పరిధిలోని ఓ భూమికి సంబంధించిన డాక్యుమెంట్ల వ్యవహారంలో సబ్ రిజిస్ట్రార్ లక్షలు లంచం డిమాండ్ చేశాడు. డబ్బులిస్తేనే పని అవుతుందని తెగేసి చెప్పడంతో లంచం ఇవ్వడం ఇష్టంలేని బాధితుడు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)ని ఆశ్రయించాడు. బాధితుడు 5.5 లక్షలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.