యాప్నగరం

Alwal Ganesh Laddu: రూ.46 లక్షలు పలికిన లడ్డూ.. బాలాపూర్ గణేష్ రికార్డు బ్రేక్

Alwal Ganesh laddu auction: అల్వాల్‌లో గణేష్ లడ్డూ.. ఆల్ టైం రికార్డు ధర పలికింది. బాలాపూర్ గణేష్ రికార్డును బ్రేక్ చేస్తూ ఏకంగా రూ.46 లక్షలు పలికింది. అల్వాల్‌కు చెందిన డాక్టర్ వెంకటరమణ, గీతప్రియ దంపతులు ఈ లడ్డూను దక్కించుకున్నారు. కిందటి ఏడాది కూడా వీళ్లే ఈ లడ్డూను వేలంపాటలో గెలుచుకున్నారు. బాలాపూర్ గణేష్ లడ్డూ ఈసారి వేలం పాటలో రూ. 24 లక్షల 60 వేలు పలుకగా.. అల్వాల్ కనాజీగూడ లడ్డూ దీనికి రెట్టింపు ధర పలికింది.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 11 Sep 2022, 7:59 pm
వినాయకుడి లడ్డూ వేలంపాట అనగానే అందరికీ బాలాపూర్‌ గుర్తుకొస్తుంది. బాలాపూర్ లడ్డూకు (Balapur Ganesh Laddu) ఉన్న ప్రత్యేక అలాంటిది. గణేష్ లడ్డూ వేలం ప్రారంభించిందే బాలాపూర్‌లో.. 1994లో రూ.450 పలికిన బాలాపూర్ గణేష్ లడ్డూ.. ఏటికేడు తన రికార్డులను తనే బ్రేక్ చేసుకుంటూ లక్షల రూపాయలు పలుకుతోంది. శుక్రవారం జరిగిన వేలంపాటలో ఈ గణనాథుడి లడ్డూ వేలంలో రూ.24 లక్షల 60 వేలు పలికింది. జాతీయ పత్రికల్లోనూ ఈ వార్తను పతాక శీర్షికన ప్రచురించగా.. ఇప్పుడు ఈ రికార్డును బ్రేక్ చేస్తూ హైదరాబాద్ నగరం కొత్త చరిత్రను లిఖించింది. అల్వాల్‌లో (Alwal Ganesh Laddu) నిర్వహించిన వేలంపాటలో వినాయకుడి లడ్డూ ఏకంగా రూ.45,99,999 ధర పలికింది. అంటే బాలాపూర్ గణేష్ లడ్డూకు దాదాపు రెట్టింపు మొత్తం. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ధర పలికిన లడ్డూ ఇదే కావడం విశేషం. ఇంతకీ ఈ లడ్డూను ఇంత ధర పెట్టి ఎవరు దక్కించుకున్నారు?
Samayam Telugu Alwal Ganesh laddu rate
అల్వాల్ గణేషుడి లడ్డూ వేలంపాట


అల్వాల్ పరిధిలోని డెయిరీ ఫామ్ రోడ్ కనాజీగూడలో ఏటా భారీ గణనాథులను ఏర్పాటు చేసి ఘనంగా గణేష్ నవరాత్రులు నిర్వహిస్తున్నారు. ఇక్కడి మరకత శ్రీ లక్ష్మీ గణపతికి ఈసారి కూడా నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చివరి రోజు లడ్డూ వేలం పాట నిర్వహించారు.

వేలంలో డాక్టర్ వెంకటరావు, గీత ప్రియ దంపతులు లడ్డూను రూ.45,99,999లకు దక్కించుకున్నారు. కిందటి ఏడాది కూడా ఈ దంపతులే వేలంలో గణేష్ లడ్డూను దక్కించుకోవడం విశేషం. ‘ఆ భగవంతుడి కటాక్షంతో మంచి స్థితిలో ఉన్నాం. అందుకే ఈసారి కూడా లడ్డూ వేలం పాటలో పాల్గొన్నా’ అని డాక్టర్ వెంకటరావు దంపతులు తెలిపారు.

బాలాపూర్‌ గణనాథుడి లడ్డూ ధర ఏటికేడు పెరుగుతూ పోతూనే ఉంది. అయితే, కొన్ని చోట్ల ఈ లడ్డూ ధరకంటే అధిక ధర పలికిన సందర్భాలు లేకపోలేదు. కానీ, ఈ స్థాయిలో ధర పలకడం మాత్రం ఇదే తొలిసారి.

బాలాపూర్ లడ్డూ కిందటేడాది కంటే ఈసారి రూ 5.70 లక్షలు అధిక ధర పలికింది. 9 మంది పోటీ పడగా.. గణేష్ ఉత్సవ సమితి సభ్యుడు వంగేటి, టీఆర్‌ఎస్ నేత లక్ష్మారెడ్డి ఈ లడ్డూను దక్కించుకున్నారు.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.