యాప్నగరం

Ambulance Mafia: ఉస్మానియా వద్ద అంబులెన్స్ మాఫియా.. రోగి బంధువుపై డ్రైవర్ దాడి

Ambulance Mafia ఉస్మానియా ఆస్పత్రిలో అంబులెన్స్ మాఫియా రెచ్చిపోతోంది. అడిగినంత ధర ఇవ్వకపోతే రోగులపై దాడులకు పాల్పడుతోంది. తాజాగా ఓ అంబులెన్స్ డ్రైవర్ మహిళపై దాడి చేసిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.

Authored byవీరేష్ బిళ్ళ | Samayam Telugu 5 Aug 2022, 3:26 pm
తెలంగాణలోనే అతిపెద్ద ప్రభుత్వాసుపత్రుల్లో ఒకటి ఉస్మానియా హాస్పిటల్(Osmania Hospital). ఇక్కడ చికిత్స కోసం తెలంగాణలోని జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారు. అయితే రోగుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఇక్కడ అంబులెన్స్ డైవర్లు రెచ్చిపోతున్నారు. మాఫియాగా ఏర్పడి అడిగినంత ధర చెల్లించాలంటూ పేద రోగులను పీల్చి పిప్పిచేస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వారి పైశాచికత్వానికి పరాకాష్టగా నిలుస్తోంది.
Samayam Telugu మహిళపై దాడికి పాల్పడుతున్న డ్రైవర్


పాతబస్తీ తాడబన్ ఏరియాకు చెందిన ఓ మహిళ ఉస్మానియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతుంది. ఆమె పూర్తిగా కోలుకోవడంతో గురువారం డాక్టర్లు ఆమెను డిశ్చార్జి చేశారు. దీంతో ఇంటికి తీసుకెళ్లేందుకు బంధువులు అంబులెన్స్‌ డ్రైవర్ల దగ్గరికి వెళ్లి మాట్లాడగా భారీ రేటు చెప్పారు. దీంతో మీ అక్కా చెల్లెలు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే మీరు ఇలాగే ప్రవర్తిస్తారా? అని అనడంతో అంబులెన్స్ డ్రైవర్ ఆరిఫ్ ఖాన్ ఒక్కసారిగా రెచ్చిపోయి దుర్భాషలాడుతూ ఓ మహిళ పై చేయి చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

ఆరిఫ్ ఖాన్ అనే వ్యక్తి ఉస్మానియా హాస్పిటల్ సిబ్బందితో కుమ్మక్కై రోగులను వేధిస్తున్నాడని, డిశ్చార్జి అయిన వారు తన అంబులెన్స్‌లో వెళ్లాలని హుకుం జారీ చేస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరైనా బయటి నుంచి అంబులెన్స్ తెచ్చుకుంటే దాడులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు. అతడి ఆగడాలను ఆస్పత్రి అధికారులు, స్థానిక పోలీసులు చూసీచూడనట్లుగా వదిలేస్తున్నారని పదేపదే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంబులెన్స్ మాఫియా నుంచి తమను రక్షించి దోపిడీకి గురికాకుండా కాపాడాలని రోగులు, వారి బంధువులు వేడుకుంటున్నారు.
రచయిత గురించి
వీరేష్ బిళ్ళ
వీరేశ్ బిల్లా సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ రాజకీయ, సినీ రంగాలకు చెందిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. దీంతో పాటు వీడియో టీమ్‌కు సేవలు అందిస్తున్నారు. తనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించి ఆర్టికల్స్ రాశారు... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.