యాప్నగరం

జైలుకెళ్లిన స్నేహితుడు.. సాయం చేస్తానని నమ్మించి అతడి భార్యతో లాడ్జీకి, చివరికి

సాయం చేస్తానని నమ్మించి స్నేహితుడి భార్యను లాడ్జీకి తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఆటోడ్రైవర్‌పై ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Samayam Telugu 13 Jan 2022, 11:39 am

ప్రధానాంశాలు:

  • హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన
  • స్నేహితుడి భార్యను లాడ్జీకి తీసుకెళ్లి అత్యాచారం
  • మళ్లీ వేధింపులకు గురిచేస్తుండటంతో పోలీసులకు ఫిర్యాదు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Image
స్నేహితుడి భార్యపై కన్నేసిన ఓ ప్రబుద్ధుడు సాయం చేస్తానంటూ నమ్మబలికి లాడ్జీకి తీసుకెళ్లి కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ బాలానగర్‌కు చెందిన మహిళ(27) అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఓ కుమారుడున్నాడు. ఆమె భర్తకు స్నేహితుడైన ఆటోడ్రైవర్ మహ్మద్ జహంగీర్ తరుచూ వారింటకి వచ్చిపోతుండేవాడు.
అయితే గతేడాది ఆగస్టులో మహిళ భర్తను గంజాయి తరలిస్తున్న కేసులో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. దీంతో నీ భర్తకు బెయిల్ ఇప్పిస్తానని, కేసు నుంచి బయటపడేసేందుకు లాయర్ ఏర్పాటు చేస్తానని జహంగీర్ ఆమెను నమ్మించాడు. ఈ నేపథ్యంలోనే అదే నెలలో ఎస్సార్‌నగర్‌ పరిధిలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెప్తే కుమారుడిని చంపుతానని బెదిరించడంతో ఆమె మౌనంగా ఉండిపోయింది.

అయితే బాధితురాలి పరిస్థితిని ఆసరాగా తీసుకున్న జహంగీర్ ఇటీవల ఆమెను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. తన కోరిక తీర్చాలని, లేకపోతే అత్యాచారం విషయం అందరికీ చెప్పి పరువు తీస్తానని బెదిరించసాగాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు దీనిపై బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్కడ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు కేసును ఎస్ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. బుధవారం నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.