యాప్నగరం

BJP ఆలోచనా విధానం దేశానికి ప్రమాదం: భట్టి విక్రమార్క

BJP ఆలోచనా విధానం దేశానికి ప్రమాదమని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క(Batti Vikramarka) ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ (BJP) పాలనలో దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగాయన్నారు. ఒకరిద్దరి చేతిలో సంపద పోగుపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మతం పేరుతో రాజీకాయలు చేస్తూ లబ్ధి పొందాలని బీజేపీ చూస్తోందని భట్టి ఆరోపించారు. మహత్ముడి ఆలోచనలకు అనుగుణంగా దేశంలో పాలన జరగటం లేదని విమర్శించారు. గాంధీ ఆలోచనా విధానంతోనే రాహుల్ గాంధీ (Rahulu Gandhi) భారత్ జోడో యాత్ర (Jodo Yatra) చేపట్టారని భట్టి అన్నారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 2 Oct 2022, 6:09 pm
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క(Batti Vikramarka) నిప్పులు చెరిగారు. బీజేపీ (BJP) పాలనలో దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగాయన్నారు. ఒకరిద్దరి చేతిలో సంపద పోగుపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మహత్ముడి ఆలోచనలకు అనుగుణంగా దేశంలో పాలన జరగటం లేదని విమర్శించారు. గాంధీజీ (Gandhi) అసమానతలు లేని దేశం కావాలని కోరుకున్నారని.. మోడీ పాలనలో మాత్రం ఆర్థిక అసమానతలు పెరిగాయని అన్నారు.
Samayam Telugu batti new
భట్టి విక్రమార్క


మతం పేరుతో రాజీకాయలు చేస్తూ లబ్ధి పొందాలని బీజేపీ చూస్తోందని భట్టి ఆరోపించారు. బీజేపీ ఆలోచనా విధానం దేశానికి ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీ ఆలోచనా విధానంతోనే రాహుల్ గాంధీ (Rahulu Gandhi) భారత్ జోడో యాత్ర (Jodo Yatra) చేపట్టారని భట్టి అన్నారు. కేసీఆర్ (Kalvakuntal Chandrashekar Rao) జాతీయ పార్టీ ఏర్పాటుపై..పార్టీ ప్రకటించిన తర్వాత మాట్లాడతానని అన్నారు. గాంధీ జయంతిని (Gandhi Birth Anniversary) పురస్కరించుకుని హైదరాబాద్‌లోని బస్తీల్లో స్వచ్ఛతపై టీఆర్‌ఎస్ (TRS) ప్రభుత్వం దృష్టి పెట్టాలని భట్టి కోరారు. త్వరలోనే సీఎల్పీ పక్షాన బస్తీబాట చేపట్టి.. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు.

ఏఐసీసీ (AICC) అధ్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లిఖార్జున ఖర్గే (Mallikarjuna Kharge) అభ్యర్థిత్వాన్ని స్వాగతిస్తున్నట్లు భట్టి స్పష్టం చేశారు. ఖర్గేను ఒక కులానికి పరిమతం చేయటం సమంజసం కాదన్నారు. కేంద్రమంత్రిగా, పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడిగా, ఫ్లోర్ లీడర్‌గా ఆయనకు అపారమైన రాజకీయ అనుభవం ఉందన్నారు. ఎన్నికల బరిలో ఉన్న మరో సీనియర్‌ నేత శశిథరూర్ (Shashi Tharoor) తన నామినేషన్ ఉపసంహరించుకొని ఖర్గేకు మద్దతు ప్రకటించాలని కోరారు. ఖర్గే ఎన్నికకు దేశంలోని కాంగ్రెస్ నాయకులందరూ సహకరించాలని భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు.
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.