యాప్నగరం

హైదరాబాద్: కరోనాతో కార్పొరేటర్ కూతురు మృతి

కరోనాతో పోరాడి ఆమె ఓడిపోయారు. ఐదు రోజుల పాటు వెంటిలేటర్ మీద ఉన్న భవాని ఈరోజు ప్రాణాలు కోల్పోయారు. దీంతో బీజేపీ కార్పొరేటర్ కరుణాకర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Samayam Telugu 9 May 2021, 10:15 am
కరోనా అనేకమంది కుటుంబాల్లో కలకలం నింపుతోంది. యువతీ యువకులు అనేక మంది ఈ వైరస్‌తో ప్రాణాలు కోల్పోతున్నారు. సెకండ్ వేవ్‌లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. తాజాగా హైదరాబాద్ గుడి మల్కాపూర్ బిజెపి కార్పోరేటర్ దేవర కరుణాకర్ కూతురు శ్రీమతి భవాణి మృతి చెందింది. గతనెల 20న ఆమె ఓ బాబుకు జన్మనిచ్చింది. అంతలోపే ఆమెను కరోనా కాటు వేసింది. అయితే భవానీకు డెలివరీ జరిగిన ఆస్పత్రిలోనే కరోనా సోకినట్లు అనుమానిస్తున్నారు. 5 రోజుల పాటు వెంటిలేటర్ మీద వున్న భవాని ఈరోజు ఉదయం ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.