యాప్నగరం

ఇంట్లోకి దూరిన నల్లత్రాచు.. శంషాబాద్ కాలనీలో కలకలం

చిన్నపిల్లలు ఉన్న ఇంట్లోకి పాము చొరబడింది. అయితే దాన్ని చూసిన పిల్లలు భయంతో కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు.

Samayam Telugu 25 Dec 2020, 11:10 am
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కాలనీలో అర్ధరాత్రి నల్లత్రాచు కలకలం రేపింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి ఎయిర్ పోర్ట్ కాలనీ అక్బర్ అనే వ్యక్తి ఇంట్లోకి నల్లత్రాచు పాము దూరింది. దీంతో పాము వచ్చిన సమయంలో ఇంట్లో చిన్నపిల్లలు మాత్రమే ఉన్నారు. దీంతో భయంతో పాము ఇంట్లోకి రావడాన్ని గుర్తించి పిల్లలు కేకలు వేస్తూ పరుగులు తీశారు. పిల్లల కేకలు విన్న పక్కింటి వారు అక్కడికి చేరుకుని చూడగా నల్లత్రాచు ఇంట్లో ఓ మూలన పెద్ద పడగ విప్పి కూర్చొంది.
Samayam Telugu ఇంట్లోకి దూరిన నల్లత్రాచు
snake in house


Read More: డేటింగ్ యాప్‌లో ఎదురింటి మహిళ... ఇదోరకం కక్ష సాధింపు

మరోవైపు నల్లత్రాచు చూసేందుకు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో పాము కదలకుండా నిలబడి పోయింది. కాలనీవాసులు అందర గుమ్మిగూడడంతో శబ్దానికి పాము అక్కడ్నుంచి మెల్లగా జారుకుంది. అక్కడ పక్కనే ఉన్న తుప్పల్లోకి పాము వెళ్లిపోయింది. ఆ తర్వాత కాలనీ వాసులు ఎంత వెతికినా కనిపించలేదు. దీంతో పెద్ద నల్ల త్రాచు పాము ఇలా ఇంట్లోకి చొరబడటంతో కాలనీ వాసులంతా భయందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.