యాప్నగరం

పెళ్లి తర్వాత కార్యక్రమానికి ఏర్పాట్లు.. ముస్తాబై వస్తానని వెళ్లిన వధువు.. షాక్

పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఆనందం ఆ వరుడికి గంటలు కూడా నిలవలేదు. పార్లర్‌కి వెళ్లి ముస్తాబై వస్తానని చెప్పి వెళ్లిన భార్య మరొకరితో వెళ్లిపోయిందని తెలిసి కంగుతిన్నాడు.

Samayam Telugu 18 Sep 2021, 3:48 pm
అప్పుడే నిఖా జరిగింది. పెళ్లి తర్వాత కార్యక్రమాలకి ఇరు కుటుంబాలు సిద్ధమయ్యాయి. బాగా ముస్తాబై వస్తానని చెప్పి వెళ్లిన వధువు ఎంతకీ తిరిగిరాలేదు. ఆమెను తీసుకెళ్లిన బంధువులను గట్టిగా ప్రశ్నించడంతో షాకింగ్ విషయం చెప్పారు. ఆమె తన ప్రియుడితో పారిపోయిందని తెలియడంతో అంతా కంగుతిన్నారు. వరుడిచ్చిన బంగారం, డబ్బులతో సహా పారిపోయినట్లు తెలియడంతో రెండు కుటుంబాల మధ్య తన్నులాట మొదలైంది. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్‌లో జరిగింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
bride


బెంగళూరుకి చెందిన బిజినెమ్యాన్ మహ్మద్ ఇలియాస్‌కి పాతబస్తీకి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 16న వివాహం జరగాల్సి ఉంది. అదే రోజు వరుడి కుటుంబీకులు హైదరాబాద్ రావడం ఆలస్యం కావడంతో మరుసటి రోజు వివాహం జరిపించాలని నిర్ణయించారు. తర్వాత రోజు 17 వ తేదీ బాలాపూర్‌లో ఓ ఇంట్లో వివాహం జరిపించారు. ఇరుకుటుంబాలు, బంధువుల సమక్షంలో నిఖా జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపటికే వరుడికి ఊహించని షాక్ తగిలింది.

పెళ్లి తర్వాత కార్యక్రమాల కోసం అందంగా ముస్తాబై వస్తానని.. పార్లర్‌కి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లిన వధువు ఎంతసేపైనా తిరిగిరాకపోవడంతో తీవ్ర కలకలం రేగింది. ఆమెను వెంటబెట్టుకెళ్లిన బంధువులను గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం చెప్పేశారు. ఆమె ప్రియుడితో పారిపోయిందని తెలియడంతో అవాక్కవడం పెళ్లికొడుకు వంతైంది. తాము లాంఛనాల కింద ఇచ్చిన రెండు లక్షల రూపాయల బంగారం, యాభై వేల నగదుతో సహా ఆమె ఉడాయించిందని తెలిసి ఆగ్రహానికి గురయ్యారు. పెళ్లికూతురు కుటుంబ సభ్యులు నమ్మించి మోసం చేశారంటూ వాదనకు దిగారు. ఇంత జరిగినా పంచాయితీ పోలీస్ స్టేషన్‌కు చేరలేదు. తమకు ఫిర్యాదు అందలేదని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.