యాప్నగరం

హైదరాబాద్ ఆకాశంలో అద్భుతం.. సూర్యని చుట్టూ రంగుల వలయం

ఈ వింతను చూసేందుక నగరవాసులు ఆసక్తి చూపించారు. మేడలు, మిద్దెలు ఎక్కి ఫోటోలు తీశారు. అయితే ఇలాంటి అద్భుతం ఆకాశంలో జరగానికి మాత్రం వర్షమే కారణమని తెలుస్తోంది.

Samayam Telugu 2 Jun 2021, 1:16 pm
హైదరాబాద్‌లో బుధవారం మధ్యాహ్నం వింత ఘటన చోటు చేసుకుంది. ఆకాశంలో ఓ అద్భుతం జరిగింది. సాధారణంగా ఇంధ్ర ధనస్సు యూ షేప్‌లో కనిపిస్తుంటుంది. కానీ అలాంటి రంగుల సర్కిల్ ఒకటి సూర్యూని చుట్టూ మెరిసింది. మిట్ట మధ్యాహ్నం మంచి ఎండుల రంగుల వలయం ఒకటి సూర్యుడి చుట్టూ కనిపించింది.
Samayam Telugu సూర్యుని చుట్టూ వలయం


సూర్యుడి చుట్టూ పెద్ద గుండ్రటి రెయిన్ బో... చాలా స్పష్టంగా కనిపించింది. నగరవాసులను కనువిందు చేసింది. అయితే ఇది ఏర్పడటానికి కారణం మాత్రం వర్షం. మంగళవారం రాత్రి నగరంలో భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా... వాతావరణంలో... నీటి బిందువులు ఉంటాయి. అవి క్రిస్టల్స్‌గా మారతాయి. అలా క్రిస్టల్స్‌గా మారిన నీటి బిందువులలో సూర్యుడి కాంతి ప్రసంరించినప్పుడు ఇలా రెయిన్ బో ఏర్పడుతుంది. దీంతో ఈ వింత రెయిన్ బో చూడటానికి నగరవాసులు ఆసక్తి చూపించారు. డాబాలపైకి ఎక్కి ఈ వింతను తమ మొబైల్ ఫోన్లలో బంధించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.