యాప్నగరం

Marri Shashidhar: బీజేపీలోకి కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి !.. క్లారిటీ ఇచ్చిన నేత

Marri Shashidhar: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి గత కొంత కాలంగా టీపీసీసీ, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందంటూ ఆయన మూడు నెలల కిందట సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అందులో భాంగగానే నిన్న ఢిల్లీ బయల్దేరారని ఇవాళ సాయంత్రం ఆయన బీజేపీలో చేరుతున్నారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. ఆ వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 16 Nov 2022, 4:28 pm

ప్రధానాంశాలు:

  • బీజేపీలోకి కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి !
  • నేడు ఢిల్లీలో కాషాయ గూటికి చేరుతున్నారంటూ వార్తలు
  • ఆ ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన మర్రి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu congress leader marri sashidhar reddy has clarified that he is joining the bjp
Marri Shashidhar: బీజేపీలోకి కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి !.. క్లారిటీ ఇచ్చిన నేత
Marri Shashidhar: తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీసి.. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల నుంచి అసంతృప్తులను పార్టీలో చేర్చుకుంటోంది. కాంగ్రెస్ నుంచి రాజగోపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకొని ఆయన్ను మునుగోడు ఉప ఎన్నికల బరిలో నిలిపింది. ఆ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైనా.. ఓట్ల శాతం పెంచుకుని అధికార టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని చెప్పే ప్రయత్నం చేసింది. ఆ ఎన్నిక సందర్భంగా జిల్లా టీఆర్ఎస్‌లో కీలక పాత్ర పోషించే భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ను పార్టీలో చేర్చుకుంది. ఆ తర్వాత తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన.., రాష్ట్ర బీజేపీ నేతల పనితీరుపై మోదీ ప్రశంసలు కురిపంచటంతో మరింత ఉత్సాహం బీజేపీ అడుగులు వేస్తోంది.
అందులో భాగంగానే అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల నుంచి అసంతృప్తులను పార్టీలో చేర్చుకునేందుకు అడుగులు వేస్తోంది. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. బీజేపీ నేతలతో కలిసి ఆయన ఢిల్లీ వెళ్లారని ఇవాళ సాయంత్రం ఆయన జేపీ నడ్డా సమక్షంలో కషాయ కండువా కప్పుకోనున్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై మర్రిశశిధర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తనకు ఢిల్లీకి వెళ్లటం కొత్తమే కాదని.., తన మనవడి స్కూల్ ఫంక్షన్ కోసం దేశ రాజధానికి వెళ్లానని చెప్పారు. అంతే తప్ప తాను కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరేందుకు కాదని క్లారిటీ ఇచ్చారు.

"మనవడి స్కూల్ ఫంక్షన్ కోసం హస్తినకు వచ్చాను. బీజేపీలో చేరుతున్నాననేది అవాస్తవం. నేను ఢిల్లీకి వచ్చిన విమానంలో అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. అంత మాత్రం దానికే పార్టీ మారుతున్నానంటూ ప్రచారం చేస్తారా?. ఇది సరైంది కాదు. నేను రాజకీయాల్లోనే ఉన్నాను. ఇంకా రిటైర్డ్ కాలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారను. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా." అని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు.

కాగా గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీలో మర్రి శశిధర్ రెడ్డి చురుగ్గా వ్యవహరించటం లేదు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణలో ఆ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణికం ఠాగూర్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌లో కల్లోలానికి రేవంత్‌ రెడ్డే కారణమని ఆరోపించారు. ఆయన కాంగ్రెస్‌కు నష్టం చేసే పనులు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌ రేవంత్‌కు ఏజెంట్‌గా పనిచేస్తున్నారని ఆరోపించారు. దీంతో ఆయన పార్టీ మారుతున్నారంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా.. ఆ ప్రచారంలో నిజం లేదని మర్రి క్లారిటీ ఇచ్చారు.
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.