యాప్నగరం

హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు షాక్.. కరోనా టెస్టు రూ.4000

ఎయిర్‌పోర్టులో ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి తప్పకుండా కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. అయితే రూ.750తో అయ్యే ఆర్టీపీసీఆర్ పరీక్షకు నాలుగువేల వసూలు చేస్తున్నారు ఎయిర్ పోర్టు సిబ్బంది.

Samayam Telugu 15 Jan 2021, 3:04 pm
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కరోనా టెస్టు పేరుతో దోపిడి మొదలైంది. ఏకంగా ఎయిర్ పోర్ట్ అధికారులు, వైద్య సిబ్బంది విదేశాల నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రయాణికులను నిలువు దోపిడీ వస్తున్న విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.. విదేశాల నుండి హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అయితే RTPCR పరీక్షకు 750 రూపాయలు అవుతుంది. కానీ ఈ పరీక్షకు అయ్యే 750 రూపాయలకు బదులుగా నాలుగు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు.
Samayam Telugu శంషాబాద్ ఎయిర్‌పోర్టు
Hyderabad airport


Read More: టీ అడిగిన మహిళా ఐపీఎస్.. చాయ్ వాలా చేసిన పనితో షాక్

అయితే దీనిపై ప్రయాణికులు ఎయిర్‌పోర్టు సిబ్బందిని నిలదీశారు. ఇంత ఎక్కువగా ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. దీంతో ప్రయాణికులు ప్రశ్నించినందుకు వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. అయితే ఈ విధంగా 750 రూపాయల RTPCR టెస్టుకు నాలుగు వేల రూపాయలు తీసుకోవడమే కాకుండా దానికి సంబంధించిన రసీదును కూడా వైద్య సిబ్బంది జారీ చేస్తుంది. అక్కడ ఉన్న పోలీసులకు విషయం తెలిసి కూడా ఇటువంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.