యాప్నగరం

నకిలీ హెల్మెట్ల దందాపై పోలీసుల కొరడా.. 12 చోట్ల సోదాలు, రూ.కోట్లల్లో సీజ్

నకిలీ హెల్మెట్ రాకెట్‌పై సైబరాబాద్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. బీఐఎస్ మార్క్ లేకుండా హెల్మెట్లు తయారుచేస్తున్న సంస్థలపై వరుస దాడులు చేస్తున్నారు

Samayam Telugu 22 Jan 2021, 4:40 pm
హైదరాబాద్‌ మహానగరంలో నకిలీ హెల్మెట్ల దందా జోరుగా కొనసాగుతోంది. కొన్ని సంస్థలు భారతీయ ప్రమాణాలను పాటించకుండా హెల్మెట్లు తయారీ చేస్తూ వాహనదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. అలాంటి వారిపై సైబరాబాద్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా నకిలీ హెల్మెట్లు తయారుచేస్తున్న సంస్థలపై దాడులు చేస్తున్న పోలీసులు పదుల సంఖ్యలో కేసులు నమోదు చేస్తున్నారు.
Samayam Telugu Image


తాజాగా ఘజియాబాద్‌లోని 12 పరిశ్రమలపై దాడులు చేసిన సైబరాబాద్ పోలీసులు రూ.కోట్లు విలువ చేసే లక్షలాది నకిలీ హెల్మెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సైబరాబాద్ అడిషనల్ డీసీపీ ప్రవీణ్ మాట్లాడుతూ.. తక్కువ ధరకు వస్తున్నాయని వాహనదారులు నాసిరకం హెల్మెట్లు కొనుగోలు చేసి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని సూచించారు. విక్రయదారులు బీఐఎస్ మార్క్ ఉన్న హెల్మెట్లనే అమ్మాలని, నకిలీవి అమ్ముతున్నట్లు తేలితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.