యాప్నగరం

చూడరా.. ‘ఈ కృష్ణగాడి గాథ..’ తిట్టిపోస్తున్న నెటిజన్లు.. సీసీటీవీ వీడియో వైరల్

Chevella Traffic Video: మత్తులో విపరీతంగా తూగిపోతూనే బైక్ నడపసాగాడు. వేగంగా వెళ్తున్న కార్లకు, బైక్‌లకు అడ్డం పడుతూ రహదారిపై ఇష్టం వచ్చినట్టు డ్రైవింగ్‌ చేసుకుంటూ వెళ్లాడు.

Samayam Telugu 9 Jul 2021, 4:18 pm
మనం హెల్మెట్‌ ధరించి, ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ రోడ్డుపై ఎంత జాగ్రత్తగా వెళ్తున్నా కూడా కొన్నిసార్లు ఇతరుల తప్పిదాల మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. ఇతరుల అజాగ్రత్త వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా అలా ఓ తాగుబోతు చేసిన పనికి రోడ్డుపై ఇతరులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఓ ప్రబుద్ధుడు ఉదయాన్నే ఫూటుగా మందు తాగి, హెల్మెట్‌ను అద్దానికి తగిలించి, బైక్‌పై బయలుదేరాడు.
Samayam Telugu రోడ్డుపై తాగుబోతు
traffic violation


మత్తులో విపరీతంగా తూగిపోతూనే బైక్ నడపసాగాడు. వేగంగా వెళ్తున్న కార్లకు, బైక్‌లకు అడ్డం పడుతూ రహదారిపై ఇష్టం వచ్చినట్టు డ్రైవింగ్‌ చేసుకుంటూ వెళ్లాడు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చేవెళ్లలోని ఇబ్రహీంపల్లి గేట్‌ వద్ద సీసీటీవీలో రికార్డయిన ఈ వీడియోను సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ట్వీట్ చేశారు.

దానికి ‘కృష్ణగారి వీర డ్రైవింగ్‌ గాథ.. మద్యం మత్తులో’ అంటూ ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. పోలీస్‌ టెక్నికల్‌ టీమ్‌ ఈ వీడియోకు బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌, బ్రహ్మానందం ఇమోజీలు జోడించి, కామెడీగా తయారు చేశారు. ‘మద్యం సేవించి వాహనం నడపొద్దు’ అని అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ పోలీసులు ఈ ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో అవుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.