యాప్నగరం

Secunderabad: దక్కన్ మాల్ కూల్చివేతలో తప్పిన ప్రమాదం

Deccan Mall Demolition: సికింద్రాబాద్‌ రాంగోపాల్ పేటలోని దక్కన్ మాల్‌ కూల్చివేతలో పెను ప్రమాదం తప్పింది. బిల్డింగ్ కూల్చే సమయంలో ఆరు అంతస్తులు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లోని స్థానికులను ముందే వేరే ప్రాంతాలకు తరలించటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 31 Jan 2023, 3:48 pm

ప్రధానాంశాలు:

  • దక్కన్ మాల్ కల్చివేత
  • ఒక్కసారిగా కుప్పకూలిన ఆరు అంతస్తులు
  • చుట్టుపక్కల ఎవరూ లేకపోవటంతో తప్పిన ప్రమాదం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu deccan mall
దక్కన్ మాల్ కూల్చివేత
Deccan Mall Demolition: సికింద్రాబాద్‌ రాంగోపాల్ పేటలోని దక్కన్ మాల్‌లో ఇటీవల భారీ అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు చిక్కుకోగా.. ఒకరి అస్తిపంజరాన్ని గుర్తించారు. మరో ఇద్దరి ఆచూకీ లభించలేదు. నాలుగు రోజుల పాటు భవనం మంటల్లోనే ఉండటంతో బిల్డింగ్ పూర్తిగా దెబ్బతింది. దీంతో కూల్చివేతకు జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నాలుగు రోజుల క్రితం బిల్డింగ్ కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. అయితే బిల్డింగ్ కూల్చివేసే సమయంలో పెను ప్రమాదం తప్పింది. ఆరు అంతస్తులు ఉన్న బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. భవనం చుట్టుపక్కల నివాసాల్లో ఉన్న స్థానికులను అక్కడి నుంచే ముందే ఖాళీ చేయించటంతో పెను ప్రమాదం తప్పింది.
ఒక్కో ఫ్లోర్ కూల్చేయాలని మందుగా జీహెచ్ఎంసీ అధికారులు భావించారు. అందుకోసం టెండర్లను ఆహ్వానించారు. ఎస్‌కే మల్లు అనే కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ రూ.25.94 లక్షలకు ముందుగా పని దక్కించుకుంది. ఆ సంస్థ ఈనెల 26న భారీ క్రేనుతో కంప్రెషర్ యంత్రాన్ని భవనంపైకి తీసుకెళ్లి కూల్చివేసే పనులను ప్రారంభించింది. క్రేన్‌తో అలాగే పట్టి ఉంచి భవనం కూల్చివేస్తామని చెప్పగా అందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఒప్పుకోలేదు.

వారి కాంట్రాక్టును రద్దు చేసి మాలిక్ ట్రేడర్స్ అనే సంస్థకు రూ.33 లక్షలకు జీహెచ్‌ఎంసీ అధికారులు టెండర్ కట్టబెట్టారు. దీంతో మాలిక్ ట్రేడర్స్ పొడవైన జేసీబీ సాయంతో కూల్చివేత పనులను ప్రారంభించింది. బస్తీ వాసులకు, స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భవనం కూల్చేయాలని అధికారులు ఆదేశించారు. దుమ్ము, ధూళి, భారీ శబ్ధాలు రాకుండా కూల్చేయాలని సూచించారు.

మొత్తం 5 అంతస్తులతో పాటు సెల్లార్ కూడా కూల్చివేయాలని ఆదేశించారు. కూల్చేసిన తర్వాత శిథిలాలను వేరే ప్రాంతానికి తరలించాలని అధికారులు ఆదేశించారు. అయితే ఇవాళ కూల్చివేత సమయంలో ఆరు అంతస్తులు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. చుట్టుపక్కల ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.