యాప్నగరం

'ఏపీలో ఆధిపత్యపోరు.. ఆశాకిరణంగా కేసీఆర్, చివరి శ్వాస వరకు ఆయనతోనే..'

ఏపీ రాజకీయాల్లో కీలక మార్పు దిశగా అడుగులు పడుతున్నాయి. బీఆర్ఎస్ విస్తరణలో భాగంగా ఏపీలో తొలి అడుగులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు బీఆర్ఎస్‌లో చేరుతున్నారు. కాగా.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు రావెల. ఏపీలో రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందని ఆరోపించారు. ఏపీ ప్రజలకు సీఎం కేసీఆర్ ఆశాకిరణంగా మారారని.. ఏపీ అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమని రావెల తెలిపారు.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 2 Jan 2023, 5:22 pm

ప్రధానాంశాలు:

  • ఏపీ రాజకీయాలపై మాజీ మంత్రి రావెల కిషోర్ కీలక వ్యాఖ్యలు
  • ఏపీలో ఆధిపత్య పోరు వల్ల 20 ఏళ్ల వెనక్కి అభివృద్ధి వెళ్లిందంటూ వ్యాఖ్య
  • బీఆర్ఎస్‌తోనే ఏపీ అభివృద్ధి సాధ్యమన్న రావెల కిషోర్ బాబు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ravela kishor
రావెల కిషోర్ బాబు
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారిందని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు అభిప్రాయపడ్డారు. ఏపీలో రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని ఆరోపించారు. రెండు పార్టీల ఆధిపత్య పోరులో ఏపీలో అభివృద్ధి 20 ఏళ్ల వెనక్కి వెళ్లిందన్నారు. ఏపీ ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారని.. అదే సమయంలో కేసీఆర్ ఆశాకిరణంగా కనిపిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ తన ముందుచూపుతో.. తెలంగాణను దేశానికే తలమాణికంగా మార్చారని కొనియాడారు. సకల జనుల సంక్షేమం, అభివృద్ధితో తెలంగాణకు పరుగులు పెట్టిస్తున్నారన్నారు. తెలంగాణలో ఎలా అయితే అభివృద్ధి జరుగుతుందో.. అలానే ఏపీలో కూడా జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఏపీ అభివృద్ధి కేవలం బీఆర్ఎస్‌తోనే సాధ్యమవుతుందని.. కేవలం ఒక్క రాష్ట్రమే కాదు దేశమంతా అభివృద్ధి చేయగల సత్తా కేసీఆర్‌కు ఉందని తెలిపారు. అందుకోసమే తాము కేసీఆర్ వెంట నడిచేందుకు సిద్ధమయ్యామన్నారు. తాను చివరి శ్వాస వరకు కేసీఆర్ వెంటనే ఉంటానని తెలిపారు.
అయితే.. ఏపీ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరుతున్న విషయం తెలిసిందే. రావెలతో పాటు మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, పార్థసారధి కూడా బీఆర్ఎస్‌లో చేరుతున్నారు. వీరి చేరికలతో బీఆర్ఎస్ విస్తరణలో భాగంగా ఏపీలో మొదటి అడుగు పడినట్టవుతుంది. కాగా.. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు పార్టీ విస్తరణ దిశగా తీవ్ర స్థాయిలో సంప్రదింపులు జరుపుతున్నారు. జనాల్లో మంచి ఆదరణ ఉన్న నేతలతో సంప్రదింపులు జరిపి.. ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీశారు. అందులో భాగంగానే.. ఏపీలోని కీలక నేతలు బీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు సమాచారం.

ఫుల్ స్వింగ్‌లో 'స్విగ్గీ'.. ఒక్క రోజే అత్యధిక కండోమ్స్ డెలివరీ.. 2.5 నిమిషాల్లోనే..
  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.