యాప్నగరం

హైదరాబాద్‌లో భారీగా పట్టుబడ్డ విదేశీ కరెన్సీ

ప్రయాణికుడి వద్ద 33 లక్షల కరెన్సీని సీఐఎస్‌ఎఫ్‌ సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. కరెన్సీతో పాటు నిందితుడ్ని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Samayam Telugu 21 Dec 2020, 11:39 am
శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. ఎయిర్ పోర్ట్ అధికారులు భారీగా కరెన్సీ పెట్టుకోవడమే కాకుండా నిందితున్ని అరెస్ట్ చేశారు. భారీ కరెన్సీ అక్రమంగా తరలిస్తున్నట్లుగా సమాచారం రావడంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి షార్జా వెళ్తున్న ఓ ప్రయాణికుడి వద్ద 33 లక్షల కరెన్సీని సీఐఎస్‌ఎఫ్‌ సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. అతని వద్ద భారీగా కరెన్సీ ఉండడంతో అతనిని అరెస్ట్ చేసే కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
Samayam Telugu భారీగా పట్టుబడ్డ విదేశీ కరెన్సీ


Read More: TS: తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. ఇద్దరు మృతి

హైదరాబాద్ నుండి షార్జా కు వెళ్తున్న ప్రయాణికుడు భారీ కరెన్సీ తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో వెంటనే అధికారులు తనిఖీలు నిర్వహించారు.హైద్రాబాద్ చాంద్రాయణగుట్ట కు చెందిన ప్రయాణికుడి లగేజ్ ను సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ ఆధికారులు తనిఖీ చేశారు. అతని బ్యాగ్లో 33 లక్షల కరేన్సీ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.వెంటనే
సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ ఆధికారులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. కరేన్సీ తో పాటు నిందితుని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు కస్టమ్స్ అధికారులు నిందితుడిని విచారిస్తున్నారు. నగదుకు సంబంధించిన వివరాలు తెలుకోవడానికి అధికారులు అతన్ని విచారిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.