యాప్నగరం

HYD: నిమజ్జనానాకి కదిలిన గణనాథులు, జోరువానలో.. కొనసాగుతున్న శోభా యాత్ర

నగరంలో గణేష్ మహరాజ్ శోభాయాత్ర కొనసాగుతోంది. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి అట్టహాసంగా బయలుదేరాడు. ట్యాంక్ బండ్ పరిసరాల్లో భారీ వర్షం కురుస్తోంది. నిమజ్జనోత్సవం కోలాహలంగా సాగుతోంది.

Samayam Telugu 19 Sep 2021, 2:31 pm
హైదరాబాబాద్ మహానగరంలో నిమజ్జనోత్సవం సందడి నెలకొంది. నవరాత్రులు పూజలందుకున్న బొజ్జ గణపయ్యలు నిమజ్జనానికి బయలుదేరారు. ఖైతరాబాద్ మహా గణపతి గంగమ్మ ఒడిలో చేరేందుకు పయనమయ్యాడు. నగరంలోని ఫలక్‌నుమా, లాల్ దర్వాజ, చాంద్రాయణగుట్ట, యాఖత్‌పురా, బహదూర్‌పురా, ఆఫ్జల్ గంజ్, బేగంబజార్, నాంపల్లి, సైఫాబాద్, అబిడ్స్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నాంపల్లి, అబిడ్స్ సైఫాబాద్, బేగంబజార్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షంలోనే శోభాయాత్ర కొనసాగుతోంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోనూ భారీ వర్షం పడుతోంది. ఖైరతాబాద్ మహా గణపతి హుస్సేన్ సాగర్ సమీపిస్తున్నాడు. నాలుగో నంబర్ క్రేన్ వద్ద ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం జరగనుంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గరుండి నిమజ్జన కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు వినాయక ప్రతిమల నిమజ్జనాలను కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటు చేసిన డ్యాష్‌బోర్డ్‌లో పరిశీలిస్తున్నారు. ఏ మార్గంలో ఎన్ని విగ్రహాలు నిమజ్జనం పూర్తి చేసుకున్నాయి.. రద్దీ తదితర విషయాలను అంచనా వేస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
Samayam Telugu ఖైరతాబాద్ మహాగణపతి
khairathabad


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.