యాప్నగరం

హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ పేలుడు, 13 మంది ఆస్పత్రికి, ఆ రసాయనాలే కారణమా?

పాతబస్తీ మీర్‌చౌక్ ప్రాంతంలోని ఓ ఇంట్లో బుధవారం రాత్రి గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. ’ఈ ఘటనలో 13 మంది గాయపడగా వీరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Samayam Telugu 21 Jan 2021, 8:11 am
హైదరాబాద్‌లోని పాతబస్తీ ప్రాంతంలో మీర్‌చౌక్‌లో బుధవారం అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో 13 మంది గాయపడ్డారు. బెంగాల్ నుండి హైదరాబాద్‌కు వలస వచ్చిన కొంతమంది స్వర్ణకారులు ఒకే ఇంట్లో కలిసి నివాసముంటున్నారు. అర్ధరాత్రి వేళ వీరి ఇంట్లో నుంచి భారీ శబ్ధాలు, కేకలు వినిపించడంతో ఉలిక్కిపడిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకుని వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.
Samayam Telugu Hyderabad cylinder blast


Also Read: అత్తింటికి వెళ్లి అదృశ్యమైన అల్లుడు.. తనకేమీ తెలియదన్న భార్య, 50రోజుల తర్వాత ట్విస్ట్

మీర్ చౌక్ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బంగారు ఆభరణాల తయారీలో వాడే రసాయనాల వల్ల పేలుడు సంభవించి గ్యాస్ లీకై ఉండొచ్చని, అందువల్లే ప్రమాద మరింత తీవ్రత పెరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: ‘తెలుగు రాకపోతే తెలంగాణకు ఎందుకొచ్చినవ్’.. అన్న మహిళా కండక్టర్‌ , షాకిచ్చిన ప్రయాణికుడు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.