యాప్నగరం

మేయర్, డిప్యూటీ మేయర్ బాధ్యతల స్వీకరణ

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ముందుగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఛార్జ్ తీసుకొనే ఫైల్‌పై సంతకం చేశారు మేయర్ విజయలక్ష్మీ.

Samayam Telugu 22 Feb 2021, 12:49 pm
గ్రేటర్ హైదరాబాద్ మేయర్‌గా గద్వాల విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ గా మోతె శ్రీలత పదవీ భాద్యతలు స్వీకరించారు. ఇవాళ ఉదయం జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం లోని 7 వ అంతస్తు లో మేయర్ చాంబర్ లో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మేయర్ గా గద్వాల్ విజయలక్ష్మి మేయర్ పదవి ఛార్జ్ తీసుకునే ఫెయిల్ పై తొలి సంతకం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, పార్లమెంటు సభ్యులు కె. కేశవరావు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేటి విద్యాసాగర్, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, శాసన సభ్యులు దానం నాగేందర్, కార్పొరేటర్లు హాజరై మేయర్ విజయ లక్ష్మీకి శుభాకాంక్షలు తెలిపారు.
Samayam Telugu మేయర్, డిప్యూటీ మేయర్


నగరంలోని పలువురు ప్రముఖులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు మేయర్ విజయ లక్ష్మీని ఈ సందర్భంగా అభినందించారు. డిప్యూటీ మేయర్ చాంబర్ లో సర్వమత ప్రార్థనలు నిర్వహించిన మోతె శ్రీలత బాధ్యతలు స్వీకరించే ఫైల్ పై సంతకం చేశారు. కె.కేశవ రావు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేటి విద్యాసాగర్, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, శాసన సభ్యులు దానం నాగేందర్, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, పలువురు కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ శ్రీలత ను అభినందించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.