యాప్నగరం

Hyderabad Rain: ఒక్కసారిగా కుండపోత వర్షం.. హైదరాబాద్ ఆగమాగం..!

Hyderabad Rain: హైదరాబాద్ నగరంలో గురువారం విచిత్ర పరిస్థితి నెలకొంది. పగలు అంతా ఎండ కొట్టి.. సాయంత్రం కాగానే ఒక్కసారిగా వర్షం కురిసింది. దీంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 18 Aug 2022, 8:47 pm

ప్రధానాంశాలు:

  • హైదరాబాద్ నగరంలో దంచికొట్టిన వాన
  • భాగ్యనగరంలో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్
  • వర్షం కారణంగా వాహనదారుల అవస్థలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Traffic jam at Nagarjuna Circle in Panjagutta
పంజాగుట్టలోని నాగార్జున సర్కిల్ వద్ద ట్రాఫిక్ జామ్
Hyderabad Rain: హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప‌లు చోట్ల గురువారం సాయంత్రం భారీ వ‌ర్షం కురిసింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఖైర‌తాబాద్‌, కూక‌ట్‌ప‌ల్లి, కేపీహెచ్‌బీ కాల‌నీ, బాలాన‌గ‌ర్‌, మియాపూర్‌, అల్విన్ కాల‌నీ, ప్ర‌గ‌తి న‌గ‌ర్‌, నిజాంపేట్‌, బోయిన్‌ప‌ల్లి, సికింద్రాబాద్‌, కాప్రా, మ‌ల్కాజ్‌గిరి, మౌలాలి, బేగంపేట్, రాంన‌గ‌ర్, తార్నాక‌, మాదాపూర్‌తో పాటు ప‌లు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో చాలాచోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది.
గ‌త రెండు రోజుల నుంచి భాగ్యనగరంలో ఎండ‌లు దంచికొట్టాయి. దీంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోయారు. మొత్తానికి వ‌ర్షం కురవడంతో.. ఉక్క‌పోత నుంచి కాస్త ఉప‌శ‌మ‌నం లభించింది. అయితే.. పగలంతా ఎండకొట్టి.. సాయంత్రం కాగానే వర్షం కురవడంతో.. వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం రావడంతో.. అవస్థలు ఎదుర్కొన్నారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.